బంగారం కొనుక్కోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే గోల్డ్ రేట్లు భారీగా పెరిగిపోవడంతో చాలా మంది కొనాలన్న ఆలోచన కూడా చేసేందుకు ప్రయత్నించరు. అయితే మీ దగ్గర కేవలం రూ.10 ఉంటే చాలు. బంగారం కొనుక్కోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.
ఫోన్‌పే తన 'డైలీ సేవింగ్స్' ప్లాన్ కింద ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు రోజుకు కనీసం రూ.10 పెట్టి డిజిటల్ బంగారం కొనుక్కోవచ్చు. బంగారంలో అందరూ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం అని ఫోన్ పే తెలిపింది.
ఇప్పుడు కేవలం 10 రూపాయలతో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చని ఫోన్‌పే(PhonePe) ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే తన పెట్టుబడిదారుల కోసం 'డైలీ సేవింగ్స్' కింద ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు ప్రతిరోజూ డిజిటల్ బంగారంలో కనీసం రూ.10 నుండి మాక్సిమం రూ.5,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం ద్వారా పెట్టుబడిదారులు కేవలం 10 రూపాయలతో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. బంగారంలో పెట్టుబడులను అందుబాటులోకి తీసుకురావడం సరసమైనదిగా చేయడం ఈ వినూత్న పథకం లక్ష్యం.
undefined
ముఖ్యంగా బంగారం ధరలు ఎక్కువగా ఉండటం వల్ల అందులో పెట్టుబడి పెట్టడం కష్టంగా మారింది. ఈ పథకం కింద వినియోగదారులు ప్రతిరోజూ డిజిటల్ బంగారంలో రూ.10 నుండి రూ.5,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. బంగారంలో పెట్టుబడి పెట్టడం మీ లక్ష్యమైతే ఫోన్‌పే అందించే ఈ కొత్త ఆఫర్ మీ కోరిక నెరవేరుస్తుంది. మీరు భారీగా సేవింగ్స్ చేసి బంగారం కొనే పరిస్థితి లేకపోయినా ఫోన్ పే అందించే ఈ పథకం మీ సమస్యకు పరిష్కారంగా నిలుస్తుంది. మైక్రో-సేవింగ్స్ ప్లాట్‌ఫామ్ జార్(JAR)తో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫోన్‌పే, 24-క్యారెట్ డిజిటల్ బంగారంలో సులభమైన పెట్టుబడులు పెట్టేలా వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. ఇది రోజువారీ పెట్టుబడులను సులభంగా యాక్సెప్ట్ చేస్తుంది. డైలీ సేవింగ్స్ ద్వారా మీ కలను మీరు నిజం చేసుకోవచ్చు. చిన్న చిన్న సేవింగ్స్ తో భవిష్యత్తులో మంచి ఆదాయాన్ని మీరు పొందవచ్చు.
కనీస రోజువారీ పెట్టుబడి రూ.10తో వినియోగదారులు పెద్ద, ముందస్తు చెల్లింపుల ఒత్తిడి లేకుండా క్రమంగా బంగారాన్ని పోగు చేసుకోవచ్చు. డైలీ సేవింగ్స్ ఉత్పత్తి జార్ గోల్డ్ టెక్ సొల్యూషన్ ద్వారా శక్తిని పొందింది. వినియోగదారులు డిజిటల్ బంగారంలో సులువుగా పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఫోన్‌పే ప్రకారం ఈ కొత్త ఫీచర్‌ని ఉపయోగించి ప్రజలు పెట్టుబడి పెట్టడానికి 45 సెకన్లు మాత్రమే పడుతుంది. తక్కువ టైమ్ లో, వేగంగా, సౌకర్యవంతంగా బంగారం కొనుగోలు చేసేలా ప్రాసెస్ రూపొందించారు. ఇటీవల డిజిటల్ బంగారం పెట్టుబడుల పట్ల పెరుగుతున్న ఆసక్తిని ఫోన్‌పే యాజమాన్యం సరైన దిశగా ఉపయోగించుకుంటోంది.
జార్ 2021లో ప్రారంభమైన ఓ స్టార్టప్ కంపెనీ. తక్కువ టైమ్ లోనే 0.5 మిలియన్ కస్టమర్లను ఆకర్ణించి ఇటీవల గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లోనూ విజయం సాధించింది. 'బెస్ట్ వెల్త్‌టెక్ స్టార్టప్' అవార్డును గెలుచుకుంది. అందరికీ అందుబాటులో ఉండే ఆర్థిక యోగ్యతని అందించడమే తమ లక్ష్యమని జార్ యజమానులు చెబుతున్నారు.
దిగ్గజ బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌తో భాగస్వామ్యమైన జార్ ఆర్థిక ఫిట్‌నెస్‌ను భారతదేశ వీధుల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 'వర్క్ టు గ్రేట్ ప్లేస్'గా మాకు గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
PhonePe ఒక భారతీయ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవలు అందించే సంస్థ. భారతదేశంలోని కర్ణాటకలోని బెంగళూరులో దీని ప్రధాన కార్యాలయం ఉంది. డిసెంబర్ 2015లో PhonePe స్టార్ట్ అయ్యింది. PhonePe యాప్ 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులను డబ్బు పంపడం, స్వీకరించడం, మొబైల్, DTH రీఛార్జ్ చేయడం, యుటిలిటీ చెల్లింపులు చేయడం, స్టోర్‌లో చెల్లింపులు చేయడం వంటి వివిధ ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.
జార్ కంపెనీకి చెందిన గోల్డ్ టెక్ సొల్యూషన్‌తో కలిపి 560 మిలియన్లకు పైగా ఫోన్‌పేలో కస్టమర్లుగా నమోదై ఉన్నారు. ఇక్కడ పెట్టబడులు చాలా ముఖ్యమని, సురక్షితమైనవి ఎక్కువ మంది ప్రజలు నమ్ముతారు. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యం డిజిటల్ బంగారం పెట్టుబడిని మరింత అందుబాటులోకి తీసుకు వస్తుందని కంపెనీ యజమానులు భావిస్తున్నారు.