అక్టోబర్‌లో రిలీజ్ అవుతున్న టాప్ 5 కార్లు ఇవే!

By Naga Surya Phani Kumar  |  First Published Oct 1, 2024, 3:57 PM IST

ఇండియాలో అక్టోబర్ 2024లో దసరా పండగతో పాటు కొత్త కార్ల పండగ కూడా జరగనుంది. వివిధ కంపెనీలకు చెందిన ఈ కార్లు అద్భుతమైన ఫీచర్స్ తో తయారై లాంచ్‌కి రెడీగా ఉన్నాయి. వాటిలో టాప్ 5 కార్ల వివరాలు, వాటి ధరలు, ఫీచర్స్, ప్రత్యేకతలు ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి. 
 


Kia EV9(కియా ఈవీ 9)

అక్టోబర్‌లో లాంచ్ అవుతున్న కియా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV మోడల్ Kia EV9. కియా ఇస్తున్న అతిపెద్ద, అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ ఆఫర్ EV9 మోడల్. ఇది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన EV లాంచ్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ కారులో 99.8kWh బ్యాటరీ ఉంది. ఇంత భారీ బ్యాటరీ ఉన్న కారు ఇదే కావడం విశేషం. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 561 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని ధర దాదాపు రూ.80 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో కియా EV9 కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అక్టోబర్ 3న లాంచ్ కానుంది. హై-ఎండ్, ఎకో-ఫ్రెండ్లీ SUV కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది పర్ఫెక్ట్ మోడల్. పర్యావరణ ప్రేమికులను కూడా ఇది ఎంతగానో ఆకర్షిస్తుంది. 

Nissan Magnite 2024(నిస్సాన్ మాగ్నైట్)

Latest Videos

undefined

నిస్సాన్ కంపెనీలో ప్రజాదరణ పొందిన మోడల్ కాంపాక్ట్ SUV మాగ్నైట్. దీని లేటెస్ట్ 2024 వెర్షన్‌ను ఇండియా మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ గా ఉండనుంది. దీని ధర రూ. 6 లక్షల నుంచి రూ.11.50 లక్షల మధ్య ఉంటుంది. దీని ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా ఎక్కువ సేల్ అవుతోంది. 2024 మోడల్ కారుకు లేటెస్ట్, డైనమిక్ లుక్ ఇవ్వడానికి నిస్సాన్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అయితే లేటెస్ మోడల్ లోనూ ఇది ప్రస్తుత మోడల్ ఇంజిన్ నే ఉపయోగిస్తోంది.  1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్(NA) పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ రెండింటినీ అందిస్తుంది. ఈ ఇంజిన్ ఎంపికలు ఇంధన సామర్థ్యం, పనితీరు మధ్య సమతుల్యతను అందిస్తాయి. పోటీతత్వం కలిగిన కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మాగ్నైట్ బలమైన పోటీదారుగా నిలుస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

BYD eMax 7(బైడ్ ఇమ్యాక్స్)

చైనా ఆటోమేకర్ BYD కంపెనీ తన ఎలక్ట్రిక్ MPV అయిన BYD eMax 7ని అక్టోబర్ 2024లోనే లాంచ్ చేయనుంది. eMax 7 మోడల్ అనేది BYD e6 MPV అప్‌డేట్ వెర్షన్. 12.8-అంగుళాల ఇన్ఫోటెయిన్‌మెంట్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక కొత్త ఫీచర్‌లతో ఈ మోడల్ మార్కెట్ లోకి వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ కారు లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)ను కూడా అందిస్తుందని భావిస్తున్నారు. ఇది టెక్నాలజీ పరంగా ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. అందువల్ల వినియోగదారుల సెలెక్షన్ లో ఇది ముందుంటుని మార్కెట్ విశ్లేషకుల అంచనా. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. విశాలమైన, పర్యావరణ అనుకూలమైన వాహనాన్ని మెరుగైన భద్రత, సౌకర్యవంతమైన ఫీచర్‌లతో కోరుకునే వారికి ఈ మోడల్ ఆకర్షణీయమైన ఎంపిక అవుతుంది.

Mercedes E-Class LWB(మెర్సిడెస్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యూబీ)

మెర్సిడెస్ బెంజ్ E-క్లాస్ LWB 2024 మోడల్ కూడా అక్టోబర్‌లో గ్రాండ్ లాంచ్‌ అవుతోంది. అక్టోబర్ 9న ఇది మార్కెట్ లో సందడి చేయనుంది. కొత్త E-క్లాస్ ధర దాదాపు రూ.80 లక్షల నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇది మార్కెట్లో అత్యంత ప్రీమియం సెడాన్‌లలో ఒకటిగా నిలుస్తుంది. పాత మోడల్స్ తో పోల్చితే 2024 మోడల్ సొగసైన, ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంటుంది. 14.4-అంగుళాల ఇన్ఫోటెయిన్‌మెంట్ డిస్‌ప్లే, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఫీచర్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రయాణీకుల కోసం 12.3 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ దీని ప్రత్యేకత. ఇలాంటి అత్యాధునిక సాంకేతికతతో మరిన్ని సదుపాయాలు ఇందులో ఉన్నాయి. కొనుగోలుదారులకు రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. 2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 2 లీటర్ డీజిల్ ఇంజిన్ లలో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇది శక్తి, ఇంధన సామర్థ్యం మధ్య సమతుల్యతను అందిస్తుంది. కొత్త E-క్లాస్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. లగ్జరీ కార్ కొనుగోలుదారుల నుండి దీనికి మంచి స్పందన లభిస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దసరా పండగ సీజన్‌తో ఈ కార్లు లాంచ్ అవుతుండటంతో కస్టమర్స్ తమ కార్లు కొనుగోలు చేయాలని కార్ల కంపెనీలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నాయి. 

Kia Carnival(కియా కార్నివాల్)

కియా కంపెనీ EV9 తో పాటు అక్టోబర్ 3 న Kia Carnival 2024 మోడల్ ను కూడా విడుదల చేస్తుంది. కార్నివల్ అనేది కియా ప్రీమియం మల్టీ పర్పస్ వెహికల్(MPV). దీని విశాలమైన ఇంటీరియర్స్, లగ్జరీ ఫీచర్స్ అందరినీ ఆకర్షిస్తాయి. 2024 వెర్షన్ దాని ప్రధాన ఇంజిన్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. అయితే లేటెస్ట్ అంశాలతో రిఫ్రెష్ చేసిన డిజైన్‌ను కంపెనీ తీసుకువస్తుందని వినియోగదారులు భావిస్తున్నారు. ఈ కారు దాని మునుపటి మోడల్ నుండి 2.2 లీటర్ల డీజల్ ఇంజిన్‌నే ఉపయోగిస్తోంది. దీని ధరల దాదాపు రూ.40 లక్షలు ఉంటుందని అంచనా. కొత్త కార్నివల్ ఇప్పటికే బుకింగ్‌ల కోసం అందుబాటులో ఉంది. స్టైలిష్, సౌకర్యవంతమైన రైడ్ కోసం చూస్తున్న కుటుంబాలు, వ్యాపార యజమానులకు ఇది కరెక్ట్ గా సరిపోతుంది. 

 

click me!