పాన్‌కార్డ్‌లో మిస్టేక్స్ ఉన్నాయా? ఫోన్‌లోనే ఆన్‌లైన్‌లో కరెక్షన్ చేసుకోండి. వివరాలు ఇవిగో

By Naga Surya Phani Kumar  |  First Published Oct 1, 2024, 2:26 PM IST

మీ పాన్ కార్డ్(Permanent Account Number)లో పేరు తప్పుగా ఉందా? అందులో ఉన్న మీ ఫోటో మార్చాలా? అడ్రస్ లో తప్పులున్నాయా? ఇలాంటివి కరెక్షన్ చేయాలంటే మీరు ప్రభుత్వ కార్యాలయాలు లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లాలి. ఈ విషయం తెలుసుకుంటే మీరు ఎక్కడికీ వెళ్లక్కర లేదు. ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ ద్వారా మీకు కావాల్సిన కరెక్షన్లు మీరే చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.


పాన్ కార్డ్ అంటే ఏమిటి?

పాన్ కార్డు అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్(Permanent Account Number). ఇది నంబర్స్, లెటర్స్ కలిసిన 10 అంకెల సంఖ్య. టాక్స్ కట్టే వారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండటం కోసం పాన్ కార్డ్ ఇస్తారు. దీన్ని ఇన్ కమ్ టాక్స్ శాఖ జారీ చేస్తుంది. మనీ లావాదేవీల్లో ట్రాన్స్‌పరెన్సీ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. పాన్ కార్డ్ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.

పాన్ కార్డు వల్ల ఉపయోగం

టాక్స్ కట్టేవారు వారి ఆదాయం గురించి ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్‌కు సమాచారం ఇవ్వడానికి పాన్ కార్డు కంపల్సరీ ఉండాలి. అంతేకాకుండా బ్యాంకింగ్ లావాదేవీలకు కూడా ఇది తప్పనిసరి. రూ. 50,000 కంటే ఎక్కువ ఉన్న డిపాజిట్లు లేదా విత్‌డ్రాలో పాన్ కార్డు కచ్చింతంగా ఉండాలి.  పెద్ద మొత్తంలో ఆస్తి కొనుగోలు లేదా విలువైన ఆస్తులు కొనుగోలు చేయడం కోసం కూడా పాన్ కార్డు తప్పనిసరి. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, లేదా డీమాట్ అకౌంట్ తెరవడం కోసం పాన్ డీటైల్స్ ఇవ్వాలి. 

పాన్ కార్డ్ ఉంటేనే రుణాలు

Latest Videos

undefined

బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డులు పొందడానికి పాన్ కార్డ్ తప్పనిసరి చేశారు. పాన్ కార్డు లేకుండా పన్ను చెల్లింపులు లేదా ట్రాన్సాక్షన్లు చేస్తే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరిమానాలు విధించవచ్చు.

పాన్ కార్డు లేకపోతే ఏమవుతుంది?

పాన్ కార్డ్ లేకపోతే పన్ను చెల్లింపులు చేయడం కాంప్లికేటెడ్ గా మారుతుంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి పాన్ కార్డు లేకపోతే సాధ్యం కాదు. పెద్ద మొత్తాల్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, డిపాజిట్లు లేదా కొనుగోళ్లు చేయడానికి పాన్ కార్డు లేకపోతే ఆ లావాదేవీలు నిలిచిపోతాయి. 

పాన్ కార్డు ఎలా పొందాలి?

NSDL లేదా UTIITSL అధికారిక వెబ్‌సైట్‌లలో పాన్ కార్డు అప్లికేషన్ ఫార్మ్ (Form 49A) అందుబాటులో ఉంటుంది. దీనిని పూర్తి చేసి సమర్పించవచ్చు. ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ లాంటివి ఇవ్వాలి. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, గ్యాస్ బిల్ వీటిల్లో ఏదైనా అప్ లోడ్ చేయాలి. మీ బర్త్ ను కన్ఫర్మ్ చేసే బర్త్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, టీసీ సర్టిఫికేట్ కూడా అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

పాన్ కార్డ్ లో మార్పులు ఎలా చేయాలి

మీ పాన్ కార్డ్(PAN)లో పేరు తప్పుగా ఉన్నా, ఫోటో మార్చాలన్నా, అడ్రస్ లో తప్పులు సరిచేయాలన్నాఇప్పుడు మీరు ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ ద్వారా మీకు కావాల్సిన కరెక్షన్లు మీరే చేసుకోవచ్చు. 

మీరు మీ ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేయండి.
అందులో NSDL వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.
pancard online applicationపై క్లిక్ చేయండి.
తరువాత apply onlineని క్లిక్ చేయండి.
Application Type దగ్గర changes or correction in existing PAN Data ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
తరువాత categery ఆప్షన్ లో Individualని సెలెక్ట్ చేసుకోండి.
మిగిలిన డీటైల్స్ అన్నీ ఎంటర్ చేయండి.
చివరగా పాన్ కార్డ్ నంబర్, క్యాప్ఛా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
ఇప్పుడు టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది. దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి.
ఈ అప్లికేషన్ కింద continue ఆప్షన్ పై క్లిక్ చేయండి.
తరువాత ఓపెన్ అయ్యే విండోలో మీరు ఏదైతే ఛేంజ్ చేయాలనుకుంటున్నారో అవి మార్చండి. అంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటో, అడ్రస్ కూడా మార్చుకోవచ్చు. 
చివరిగా పేమెంట్ కట్టాలి. ఇది కూడా మీరు ఆన్ లైన్ లోనే పే చేయొచ్చు. 
ఈ ప్రాసెస్ కి ఫీజు కేవలం రూ.107 మాత్రమే. దీన్ని మీరు ఆన్ లైన్ల లోనే కట్టేయొచ్చు. 
ఒకసారి ఆన్ లైన్ పేమెంట్ సరిగ్గా జరిగితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయినట్లే. 
మార్పులు జరిగిన తర్వాత కొత్త పాన్ కార్డ్ మీరు అడ్రస్ ప్రూఫ్ కోసం ఇచ్చిన దాని ప్రకారం వస్తుంది. 
 

click me!