డ్రైవర్, పనిమనిషితో సహ వారికి బ్యాంక్ సి‌ఈ‌ఓ రూ. 4 కోట్ల గిఫ్ట్.. ఎటువంటి బంధుత్వం లేకున్నా..

Ashok Kumar   | Asianet News
Published : Feb 22, 2022, 06:50 PM ISTUpdated : Feb 22, 2022, 06:52 PM IST
డ్రైవర్, పనిమనిషితో సహ వారికి  బ్యాంక్ సి‌ఈ‌ఓ రూ. 4 కోట్ల గిఫ్ట్.. ఎటువంటి బంధుత్వం లేకున్నా..

సారాంశం

ప్రైవేట్‌ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో వి. వైద్యనాథన్‌ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. తన ట్రెయినర్, పనిమనిషి, డ్రైవర్‌తో పాటు అయిదుగురికి 9 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చారు.  

న్యూఢిల్లీ: ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఒ వి.వైద్యనాథన్  రూ. 3.95 కోట్ల విలువైన బ్యాంక్‌లోని 9 లక్షల షేర్లను తన ట్రైనర్, హౌస్‌హెల్ప్, డ్రైవర్‌తో సహా ఐదుగురికీ ఇళ్లు కొనుగోలు చేయడంలో సహాయం చేసేందుకు బహుమతిగా ఇచ్చారు. వైద్యనాథన్ తన వ్యక్తిగత హోల్డింగ్స్ నుంచి ఈ షేర్లను ఎలాంటి పరిశీలన లేకుండా ఇచ్చారని ఫైలింగ్‌లో పేర్కొంది.  వైద్యనాథన్ షేర్లు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. విశేషం ఏంటంటే ఈ ఐదుగురికీ ప్రైవేట్ రంగ బ్యాంకు ఉన్నతాధికారి వి.వైద్యనాథన్ కి ఎటువంటి బంధుత్వ సంబంధం లేదు.

వి.వైద్యనాథన్ ఇంతకుముందు కూడా తనకు సంబంధం లేని కొంతమందికి వాటాలను బహుమతిగా ఇచ్చారు. మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి వైద్యనాథన్ 21 ఫిబ్రవరి 2022న తన ఐ‌డి‌ఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ 9,00,000 ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇచ్చారని బ్యాంక్ సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

అతని  ట్రైనర్ రమేష్ రాజుకు 3 లక్షల షేర్లను బహుమతిగా ఇవ్వగా, హౌస్‌హెల్ప్ ప్రాంజల్ నార్వేకర్ ఇంకా డ్రైవర్ అలగర్‌సామికి ఒక్కొక్కరికి 2 లక్షల షేర్లు, ఆఫీస్ సహాయక సిబ్బంది దీపక్ పఠారే అండ్ హౌస్‌హెల్ప్ సంతోష్ జోగాలేలకు ఒక్కొక్కరికి 1 లక్ష షేర్లు బహుమతిగా ఇచ్చారు. బిఎస్‌ఇలో సోమవారం బ్యాంక్ స్టాక్ ముగింపు ధర రూ. 43.90తో లెక్కిస్తే వైద్యనాథన్ బహుమతిగా ఇచ్చిన 9 లక్షల షేర్ల విలువ రూ. 3,95,10,000.

అదనంగా సామాజిక సేవా కార్యకలాపాల కోసం వైద్యనాథన్‌కు చెందిన రుక్మణి సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ 2 లక్షల షేర్లను విరాళంగా ఇచ్చినట్లు బ్యాంక్‌ వివరించింది.   " బహుమతులు, సామాజిక కార్యకలాపాల కోసం ఇచ్చిన మొత్తం 11 లక్షల ఈక్విటీ షేర్లు, ఈ లావాదేవీల నుండి వి.వైద్యనాథన్  ఎటువంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రయోజనాలను పొందలేదని అని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !