ఉద్యోగులకు ఐటీ దిగ్గజ కంపెనీల చేదు వార్తా.. వర్క్ ఫ్రమ్ హోంకి టీసీఎస్, విప్రోతో సహ బై బై..: రిపోర్ట్

Ashok Kumar   | Asianet News
Published : Feb 22, 2022, 04:00 PM IST
ఉద్యోగులకు ఐటీ దిగ్గజ కంపెనీల చేదు వార్తా.. వర్క్ ఫ్రమ్ హోంకి టీసీఎస్, విప్రోతో సహ  బై బై..: రిపోర్ట్

సారాంశం

టిసిఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి అగ్ర ఐటి సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవిజన్‌ను ముగించి ఉద్యోగులను తిరిగి ఆఫీసులకి రావాలని కోరుతున్నాయని మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

న్యూఢిల్లీ: పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులను  క్రమక్రమంగా తిరిగి ఆఫీసులకి వచ్చి విధులు నిర్వహించేలా  కోరాలని ఆలోచిస్తున్నాయి.గత సెప్టెంబరు నుండి ఉద్యోగులను ఆఫీసులకి తిరిగి రావాలని కంపెనీలు కోరినట్లు ప్రకటించినప్పటికీ పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులు, లాక్‌డౌన్‌ నియమాల కారణంగా ఈ  నిర్ణయాలని నిలిపివేసాయి.

టిసిఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి అగ్ర ఐటి సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవిజన్‌ను ముగించి ఉద్యోగులను ఆఫీసులకి తిరిగి రావాలని కోరుతున్నాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి.ఒక నివేదిక ప్రకారం రెండు డిసుల వ్యాక్సినేషన్‌ను పొందిన మేనేజర్ స్థాయి ఉద్యోగులందరినీ మార్చి 3లోగా ఆఫీసులకి తిరిగి రావాలని విప్రో కోరింది. అయితే విప్రో ఆఫీస్ ప్యాటర్న్  వారానికి రెండు రోజుల పనితో ప్రారంభమవుతుంది. అలాగే మిగిలిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం  కొనసాగించవచ్చు.

టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా ఆఫీసు తిరిగి తెరవాలని యోచిస్తోంది. అయితే ఉద్యోగులు తిరిగి రావడం తప్పనిసరి కాదు. కాగ్నిజెంట్ ఉద్యోగులను ఏప్రిల్ నుండి స్వచ్ఛందంగా ఆఫీసులకి తిరిగి రావాలని కోరుతుంది. కాగ్నిజెంట్ కార్యాలయాలను దశలవారీగా తిరిగి తెరవాలని యోచిస్తున్నట్లు మరో నివేదిక నివేదించింది.

టి‌సి‌ఎస్ ఉద్యోగులను హైబ్రిడ్ మోడల్‌లో కూడా  పని చేయడానికి అనుమతిస్తుంది, అంటే వారు వర్క్ ఫ్రమ్ హోం కొనసాగించవచ్చు  లేదా అప్పుడప్పుడు ఆఫీసులలో ఉండవచ్చు. అదే విధంగా ఇన్ఫోసిస్ కూడా రాబోయే రెండు నెలల్లో  ఉద్యోగుల కోసం హైబ్రిడ్ మోడల్‌ను అవలంబిస్తుంది.
 

PREV
click me!

Recommended Stories

Best cars Under 8Lakhs: రూ. 8 లక్షలలోపే వచ్చే బెస్ట్ కార్లు ఇవే, భారీగా అమ్మకాలు
Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే