వాట్సాప్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయడం తెలుసా?

By rajashekhar garrepallyFirst Published May 4, 2019, 1:28 PM IST
Highlights


సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ వ్యాపారుల కోసం ‘వాట్సాప్ బిజినెస్’ యాప్ తీసుకొచ్చింది. తమ కస్టమర్లు, క్లైంట్లతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉపయోగపడుతుంది. 
 

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ వ్యాపారుల కోసం ‘వాట్సాప్ బిజినెస్’ యాప్ తీసుకొచ్చింది. తమ కస్టమర్లు, క్లైంట్లతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉపయోగపడుతుంది. 

అయితే, సాధారణంగా ఉండు వాట్సాప్ కంటే బిజినెస్ వాట్సాప్ కొంత భిన్నంగా ఉంటుంది. ఈ యాప్ కూడా ఎవరైనా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. తమ బిజినెస్‌కు సంబంధించిన విషయాలను కస్టమర్లతో పంచుకోవచ్చు. 

వాట్సాప్ బిజినెస్ యాప్‌ను కూడా కంప్యూటర్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. వాట్సాప్ లాగే వాట్సాప్ బిజినెస్ యాప్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. బిజినెస్ యాప్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా మీరు యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ బిజినెస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంది. 
అందులో ఉన్న వ్యాపారాల జాబితా నుంచి మీ బిజినెస్ ఎంచుకోవాలి.
నియమ నిబంధనల్ని యాక్సెప్ట్ చేయండి.

మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొఫైల్ క్రియేట్ చేయండి. ప్రొఫైల్‌లో మీ బిజినెస్ పేరు, డిస్క్రిప్షన్, బిజినెస్ ఇమెయిల్ ఐడీ, మీ వెబ్‌సైట్ లింక్, బిజినెస్ అడ్రస్ లాంటి వివరాలను సమర్పించాలి. 

మీరు ఒక ఫోన్ నెంబర్‌తో సాధారణ వాట్సాప్ లేదా బిజినెస్ అకౌంట్ ఏదైనా ఒకటే క్రియేట్ చేసే అవకాశం ఉంది. అందుకే బిజినెస్ అకౌంట్ కోసం మరో నెంబర్ ఉపయోగిస్తే మంచిది. కస్టమర్లకు వేగంగా సమాధానాలు ఇవ్వడానికి ఆటోమెటెడ్ మెసేజ్ సెట్ చేసుకోవాలి. మీ కాంటాక్ట్స్, చాట్స్, లేబుల్స్‌తో వాట్సాప్ బిజినెస్ యాప్‌ను నిర్వహించుకోవచ్చు.

click me!