ఆఫ్‌లైన్‌లో ‘పాన్’ దరఖాస్తు: ఈ 10 తప్పులు చేయొద్దు

By rajashekhar garrepallyFirst Published May 4, 2019, 12:23 PM IST
Highlights

ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్) కార్డు అవసరమే. అయితే, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి పొరపాట్లు లేకుండా మీ పాన్ కార్డు మీ చేతికి వస్తుంది.
 

ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్) కార్డు అవసరమే. అయితే, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి పొరపాట్లు లేకుండా మీ పాన్ కార్డు మీ చేతికి వస్తుంది.

దరఖాస్తులోనే తప్పులు ఉంటే సమస్యలు తప్పవు. కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా.. పాన్ కార్డులో తప్పులను సరిచేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నా.. ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని సరైన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 272బీ కింద ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్నా ఇబ్బందులు తప్పవు. రూ. 10వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు కీలకమైన పాన్ కార్డు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 

కొత్తగా పాన్ కార్డు కోసం 49ఏ ఫాం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పాన్ కార్డులో తప్పులు దొర్లకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

1. పాన్ కార్డు దరఖాస్తుపై మీ ఫొటోను పిన్ చేయకూడదు. ఫొటో కోసం  కేటాయించిన బాక్సులో అతికించాలి.

2. పాన్ కార్డు దరఖాస్తు ఫాం నింపేటప్పుడు ఏవైనా తప్పులు దొర్లితే వాటిని దిద్దకుండా.. కొత్త ఫాం డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. వైట్‌నర్ కూడా ఉపయోగించకూడదు.

3. సంతకాన్ని కేటాయించిన బాక్సులోనే చేయాలి.

4. ఫొటోపైన సంతకం చేయకూడదు. ఫొటోపైన పెన్ను గీతలు, గుర్తులు ఉంటే మీ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది.

5. పూర్తి పేరు రాయడం మర్చిపోవద్దు. పేరును షార్ట్ కట్‌లో రాయొద్దు. తేదీ, హోదా లాంటి అనవసరమైన వివరాలు రాయొద్దు. 

6. ఇప్పటికే మీ దగ్గర పాన్ కార్డు ఉంటే మరో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం చట్టవిరుద్ధం. అయితే, అదే నెంబర్‌తో కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పాన్ కార్డులో వివరాలను మార్చుకోవచ్చు. 

7. తండ్రి పేరు రాయాల్సిన చోట భార్య లేదా భర్త పేరు రాయకూడదు.

8. మీ ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ తప్పులు లేకుండా రాయాలి

9. దరఖాస్తు ఫాంపైన సంతకం చేయడం మర్చిపోవద్దు. సూచించిన చోట సంతకం చేయకపోతే దరఖాస్తును అనుమతించరు.

10. మీ దరఖాస్తు ఫాంను మీ దగ్గర్లోని NSDL( INCOME TAX PAN SERVICES UNIT (Managed by NSDL e-Governance Infrastructure Limited), 5th Floor, Mantri Sterling, Plot No. 341, Survey No. 997/8, Model Colony, Near Deep Bungalow Chowk, Pune - 411 016.) చిరునామాకుపంపాలి.

 

సంబంధిత వార్తలు చదవండి:

పాన్ కార్డ్ అడ్రస్ అప్‌డేట్ చేసుకోండిలా..

11లక్షల పాన్ కార్డులు డీ యాక్టివేట్... అందులో మీదీ ఉందా..?

click me!