Govt to provide: ప్రభుత్వం నుండి బ్యాంకులకు రూ.15,000 కోట్ల మూలధనం

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 28, 2022, 02:06 PM IST
Govt to provide: ప్రభుత్వం నుండి బ్యాంకులకు రూ.15,000 కోట్ల మూలధనం

సారాంశం

2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం రూ.15,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చనుంది. మార్చి రెండో వారంలో ఈ మొత్తాన్ని బలహీనంగా ఉన్న బ్యాంకులకు అందించనుంది.

2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం రూ.15,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చనుంది. మార్చి రెండో వారంలో ఈ మొత్తాన్ని బలహీనంగా ఉన్న బ్యాంకులకు అందించనుంది. ఆ బ్యాంకుల క్యాపిటల్ రిజర్వ్ రిక్వర్‌మెంట్స్‌కు అనుగుణంగా ఈ మొత్తాన్ని ఇవ్వనుంది. ఇందులో ఎక్కువ భాగం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు ఉన్నాయి. గత ఏడాది వడ్డీరహిత బాండ్స్ జారీ ద్వారా నిధులు సమకూర్చుకున్న బ్యాంకులకు ఈ అదనపు మూలధనం లభిస్తుంది.

అయితే బాండ్స్ వ్యాల్యుయేషన్‌ను ముఖవిలువ కంటే తక్కువగా లెక్కగట్టినట్లు ఆర్బీఐ అభిప్రాయపడింది. నిధులు సమకూర్చుకున్నప్పటికీ ఆయా బ్యాంకుల టియర్ 1 మూలధన నిల్వలు నిర్దేశిత స్థాయి కంటే తక్కువగా ఉన్నట్లు భావిస్తోందట. దీంతో PSBలకు ప్రభుత్వం అదనపు మూలధనం సమకూర్చాల్సి ఉంది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు రూ.4600 కోట్ల ఈక్విటీ మూలధన సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ప్రిపరెన్షియల్ పద్ధతిలో ప్రభుత్వానికి షేర్ల కేటాయింపు ద్వారా నిధులను సమీకరించనుంది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను గతంలో వేసిన అంచనా రూ.20,000 కోట్ల మూలధన సాయాన్ని రూ.15,000 కోట్లకు సవరించారు. 2020-21 మూడో త్రైమాసికంలో వడ్డీయేతర బాండ్స్ ద్వారా పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులోకి మొదటిసారి మూలధనం సమకూర్చింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులోకి 2021 మార్చిలో రూ.14500 కోట్ల నిధులు చొప్పించింది. సెంట్రల్ బ్యాంకుకు రూ.4800 కోట్లు, యూకో బ్యాంకులోకి రూ.2600 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి రూ.3000 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోకి రూ.4100 కోట్లు వెళ్లాయి.

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు