
రష్యా రూబుల్ యూఎస్ డాలర్‌తో పోలిస్తే 117కి పడిపోయింది. ఉక్రెయిన్ పై యుద్ద ప్రభావంతో యూరోపియన్ యూనియన్, పశ్చిమ దేశాలలోని ఇతర దేశాల నుండి ఆంక్షలు విధించిన తరువాత రష్యా రూబుల్ 41 శాతం క్షీణించింది. రష్యా ఆగస్టు 26, 1988వ సంవత్సరంలో ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న నష్టం కంటే ఈ సంక్షోభం దానిని మించిపోయింది.
రష్యాకు చెందిన కీలక బ్యాంకులను తొలగిస్తున్నట్టు ఇప్పటికే పశ్చిమ దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రష్యన్ వాసుల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్‌పై దాడిచేసిన రష్యాపై పాశ్చాత్య దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అందులో భాగంగానే గ్లోబల్ పేమెంట్స్ సిస్టమ్ SWIFT నుంచి రష్యాను మినహాయించే ఒప్పందంలో ఆర్థిక ఆంక్షలు విధించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకుల అంతర్గత గ్లోబల్ పేమెంట్స్ నిలిచిపోతాయనే ఆందోళనల నేపథ్యంలో ముందుగానే రష్యా వాసులంతా బ్యాంకులకు దగ్గరకు పరుగులు పెడుతున్నారు. ఆయా బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు విత్ డ్రా చేసుకుని ఇంట్లో దాచిపెట్టుకునేందుకు బ్యాంకులకు క్యూ కట్టేస్తున్నారు. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ప్రజలకు హామీ ఇచ్చిన రష్యన్‌లు తమ డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
"రష్యన్ రూబుల్ ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయిందని, డాలర్‌తో పోలిస్తే 117.62 RUB వద్ద ట్రేడవుతోంది. జనవరి 1, 2022 నుండి రూబుల్ 47.33 శాతం వరకు క్షీణించింది. US డాలర్. తూర్పు ఐరోపాలో ఘర్షణ కరెన్సీ విధ్వంసానికి ఆజ్యం పోసిందని, రష్యా ద్రవ్యోల్బణాన్ని సంవత్సరానికి 69.4%గా కొలుస్తున్నట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీలో ఆర్థికవేత్త అయిన స్టీవ్ హాంకే తెలిపారు.
రష్యాలో జీవన ప్రమాణాలు పడిపోతాయని, దిగుమతి చేసుకున్న వస్తువులు చాలా ఖరీదుగా మారతాయని, అలాగే దిగుమతి వస్తువులు కొరతకు దారితీస్తాయని, రష్యా తన చమురు, గ్యాస్ ఎగుమతుల కోసం 40 శాతం ఎక్కువ రూబుల్‌లను పొందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రష్యా దురాక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు కీలక చర్యలు చేపట్టాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య కెనడా, బ్రిటన్‌లు..స్విఫ్ట్ (సోసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్స్) నుంచి రష్యాకు చెందిన కీలక బ్యాంకులను తీసేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో రష్యాన్ వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్ పై దాడికి కఠినమైన పాశ్చాత్య ప్రతిస్పందనగా గ్లోబల్ పేమెంట్స్ సిస్టమ్ స్విప్ట్ నుంచి రష్యాను మినహాయించే ఒప్పందం గురించి వార్తలు గుప్పుమన్నాయి.