దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు మళ్ళీ బ్యాంకులు బంద్....

By Sandra Ashok KumarFirst Published Jan 28, 2020, 11:22 AM IST
Highlights

బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చలని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు బ్యాంకు యూనియన్లు జనవరి 31 నుంచి రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నట్లు బ్యాంక్ యూనియన్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.

న్యూ ఢిల్లీ: జనవరి 31 జరగనున్న 2 రోజుల దేశవ్యాప్త సమ్మె కారణంగా బ్యాంకు కార్యకలాపాలపై సమ్మే  ప్రభావం ఉంటుండొచ్చు అని ఎస్‌బిఐ, ఇతర పిఎస్‌యు బ్యాంకులు తమ వినియోగదారులకు హెచ్చరించాయి.బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చలని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు బ్యాంకు యూనియన్లు జనవరి 31 నుంచి రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నట్లు బ్యాంక్ యూనియన్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.


ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్(NOBW) సహా తొమ్మిది బ్యాంక్ యూనియన్ల, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ సమ్మె పిలుపునిచ్చింది. 

also read Budget 2020: ఆరేళ్లలో బడ్జెట్‌లో సమూల మార్పులు: ఫిబ్రవరి ఒకటో తేదీకి చేంజ్

చీఫ్ లేబర్ కమిషనర్ ముందు సోమవారం జరిగిన సమావేశం విఫలం అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి యూనియన్లు సమ్మె నోటీసును వెనక్కి తీసుకోలేదని AIBOC అధ్యక్షుడు సునీల్ కుమార్ చెప్పారు.ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగుల వేతన సవరణ నవంబర్ 2017 నుండి పెండింగ్‌లో ఉంది.

యూనియన్ల డిమాండ్‌పై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నుండి స్పష్టమైన సమాచారం లేనందున, సమ్మెకు పిలుపునిచ్చింది అని AIBEA ప్రధాన కార్యదర్శి సి హెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు."ఐబిఎ కఠినమైన విధానం వల్ల సమ్మెకు వెళ్ళడం కంటే మాకు వేరే మార్గం లేకుండా పోయింది. సమ్మె కారణంగా సేవల్లో ఈ అంతరాయం ఏర్పడినందుకు మాతో సహకరించాలని మేము బ్యాంకింగ్ కస్టమర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము, కాని బ్యాంక్ మేనేజ్‌మెంట్లు, ఐబిఎలు మాపై బలవంతం చేశాయి, " అని ఒక ఉద్యోగి చెప్పాడు.

also read ఎయిర్‌ఇండియా అమ్మకానికి ఆహ్వానం... టాటా సన్స్, హిందూజాల ఆసక్తి ?

జనవరి 31 నుంచి ప్రారంభమయ్యే రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె కారణంగా కార్యకలాపాలు కొంతవరకు ప్రభావితమవుతాయని ఎస్‌బిఐతో సహా చాలా బ్యాంకులు వినియోగదారులకు తెలియజేశాయి."ఈ నేపథ్యంలో, జనవరి 13 న ముంబైలో జరిగిన యుఎఫ్‌బియు సమావేశంలో ఏకగ్రీవంగా విధులు బహిష్కరించి సమ్మె చేయాలని నిర్ణయానికి వచ్చింది" అని ఇది తెలిపింది.

పే స్లిప్  పై 20% పెంపుతో వేతన పెంచాలని యూనియన్లు కోరుతున్నాయి. అక్టోబర్ 31, 2017 వరకు, ఉద్యోగులకు 15% పెంపు చేసింది.ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వ "ప్రజా వ్యతిరేక" విధానాలకు వ్యతిరేకంగా 10 ప్రధాన కార్మిక సంఘాల నిరసన పిలుపుకు మద్దతుగా బ్యాంక్ ఉద్యోగులలో ఒక విభాగం జనవరి 8 న ఒక రోజు సమ్మెకు దిగింది.
 

click me!