బంగారం, వెండి ధరల అప్ డేట్: నేడు రికార్డ్ స్థాయికి చేరువలో పసిడి.. ఒక్కరోజే ఎంత పెరిగిందటే..?

By asianet news teluguFirst Published Jan 6, 2023, 12:06 PM IST
Highlights

ఎంసీఎక్స్‌లో సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ రూ.337 పెరిగి కిలో రూ.68,415 వద్ద ట్రేడవుతున్నాయి.  స్పాట్ బంగారం ఔన్స్‌కు 0.3% పెరిగి $1,838.38కి చేరుకుంది, ఇప్పటివరకు వారానికి దాదాపు 0.8% పెరిగింది.

ఈ రోజు మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య శుక్రవారం బంగారం ధర అధికంగా ట్రేడవుతోంది, వెండి ధర కూడా 0.5% పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ. 93 లేదా 0.17% పెరిగి 10 గ్రాములకు రూ.55,383 వద్ద ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ రూ.337 పెరిగి కిలో రూ.68,415 వద్ద ట్రేడవుతున్నాయి.  స్పాట్ బంగారం ఔన్స్‌కు 0.3% పెరిగి $1,838.38కి చేరుకుంది, ఇప్పటివరకు వారానికి దాదాపు 0.8% పెరిగింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% లాభపడి $1,843.80కి చేరుకుంది.

నేడు 06 జనవరి 2023న  ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలో బంగారం ధరలు ఎగిశాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,460, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.56120 వద్ద ఉంది.  చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,290 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,040. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,960. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960. వెండి ధరలు చూస్తే కోల్‌కతా, ముంబైలలో కేజీ వెండి ధర రూ.71,000, చెన్నైలో వెండి ధర రూ. 74,000. 

హైదరాబాద్, బెంగళూరు, కేరళ అండ్ విశాఖపట్నంలలో కూడా ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,960. 

హైదరాబాద్‌లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 51,300, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,960. అంటే నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరగగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగింది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,960. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,960. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,000.

 స్పాట్ వెండి $23.22 వద్ద నిలకడగా ఉండగా, ప్లాటినం 0.2% నష్టపోయి $1,056.16కు, పల్లాడియం 0.4% తగ్గి $1,737.59కి చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి. అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు అనేక ఇతర కారణాలు బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణాలు అని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

click me!