పెట్రోల్ డీజిల్ ధరల అప్ డేట్: నేడు ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు లీటరుకి ఎంతో తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Jan 6, 2023, 9:57 AM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి  కొన్ని రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్ కూడా తగ్గించాయి. గత ఏడాది ఆగస్ట్ 24న VATని పెంచినప్పుడు ఇంధన ధరలను అప్‌డేట్ చేసిన చివరి రాష్ట్రం మేఘాలయ.

నేడు ఇంధన ధరలు 6 జనవరి 2023 శుక్రవారం రోజున స్థిరంగా ఉన్నాయి. దాదాపు ఏడు నెలల పాటు పెట్రోల్ డీజిల్ ధరలల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర వరుసగా రూ.89.62గా ఉంది. గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి  కొన్ని రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్ కూడా తగ్గించాయి. గత ఏడాది ఆగస్ట్ 24న VATని పెంచినప్పుడు ఇంధన ధరలను అప్‌డేట్ చేసిన చివరి రాష్ట్రం మేఘాలయ, ఈ కారణంగా షిల్లాంగ్‌లో ఇప్పుడు పెట్రోల్ ధర రూ. 96.83, డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ. 84.72. మహారాష్ట్ర ప్రభుత్వం జూలైలో పెట్రోల్‌పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ని లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గించింది.

చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24
కోల్‌కతా: ఈరోజు పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 106.03, డీజిల్ ధర లీటర్‌కు రూ. 92.76,
బెంగళూరు: పెట్రోలు ధర లీటర్‌కు రూ. 101.94, డీజిల్ ధర రూ.89 లీటరుకు
లక్నో: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76
నోయిడా: పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర లీటరుకు రూ. 89.96 
గురుగ్రామ్: పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర లీటరుకు రూ. 90.05
చండీగఢ్: పెట్రోలు ధర రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26
హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

2020-21 అండ్ 2021-22 మధ్య సంవత్సరంలో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCలు) పెట్రోల్ ఎగుమతి 142% పెరిగింది, డీజిల్ ఎగుమతిలో 1% కంటే తక్కువ పెరుగుదల ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం, OMCలు 2021-22లో 668 వేల మెట్రిక్ టన్నుల (TMT) పెట్రోల్‌ను ఎగుమతి చేశాయి, ఇది 2020-21లో దేశం ఎగుమతి చేసిన 276 TMT పెట్రోల్ కంటే 142 శాతం ఎక్కువ.

పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతాయి, ఇంకా విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL),  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు ( IOCL) , హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు మరియు ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ధరలను సవరిస్తాయి.

click me!