జనవరి 9 కొత్త మహీంద్రా థార్ కారు విడుదలకు సిద్ధం, ఇంజిన్, ఫీచర్లు, లాంచింగ్ వివరాలు మీ కోసం..

By Krishna AdithyaFirst Published Jan 6, 2023, 12:45 AM IST
Highlights

దేశంలోనే అతిపెద్ద ఆటో దిగ్గజ  కంపెనీల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలోనే కొత్త మహీంద్రా థార్ RWD వేరియంట్‌ మార్కెట్లోకి అందుబాటులోకి తేనుంది. దీనికి సంబంధించిన ఫీచర్లను తెలుసుకుందాం.

కొత్త మహీంద్రా థార్ RWD వేరియంట్‌లు జనవరి 9, 2023న భారతదేశంలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. దాని మార్కెట్ ప్రారంభానికి ముందు, కార్‌మేకర్ తన అధికారిక వెబ్‌సైట్‌లో SUV బ్రోచర్‌ను అప్ డేట్ చేసింది, అందులో కారు గురించి అన్న వివరాలతో పాటు, ఇంజిన్ వివరాలు, స్పెసిఫికేషన్‌లు, కొత్త రంగు ఎంపికలను వెల్లడించింది. 

కొత్త థార్ ఆర్‌డబ్ల్యుడి వెర్షన్ కొత్త 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను పొందింది. ఇది 118బిహెచ్‌పి పవర్, 300ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. XUV300 సబ్‌కాంపాక్ట్ SUVలో అదే ఇంజన్ డ్యూటీ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న 2.0L పెట్రోల్ ఇంజన్ వెనుక చక్రాల డ్రైవ్ సిస్టమ్‌తో 152bhp శక్తిని, 300Nm (MT)/320Nm (AT) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త 1.5L డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. అయితే 2.0L టర్బో పెట్రోల్ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. అలాగే, కంపెనీ RWD సెటప్‌తో పాటు 1.5L డీజిల్ , 2.0L పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో లోయర్-ఎండ్ AX(O) ట్రిమ్‌ను పరిచయం చేస్తుంది.

ఫీచర్ల పరంగా, కొత్త మహీంద్రా థార్ RWD AX (O) మోనోక్రోమ్ MID డిస్ ప్లే , వినైల్ అప్హోల్స్టరీ, మాన్యువల్ మిర్రర్ సర్దుబాటు, ట్యూబ్యులర్ స్టీల్ సైడ్ స్టెప్ , 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందిస్తుంది. అయితే, ఇందులో క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్-బిల్ట్ స్పీకర్లు లేవు.

1.5L AX (O) వేరియంట్ హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్ , రోల్ ఓవర్ మిటిగేషన్‌తో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌ను పొందుతుంది. థార్ RWD వేరియంట్‌లు కొత్త బ్లేజింగ్ బ్రాంజ్ , ఎవరెస్ట్ వైట్‌లలో అందుబాటులో ఉంటాయి. SUV 4X4 వెర్షన్ గెలాక్సీ గ్రే, ఆక్వామెరిన్, రెడ్ రేజ్, నాపోలి బ్లాక్ అనే నాలుగు  కలర్లలో అందుబాటులోకి వస్తోంది.

కంపెనీ నుండి వచ్చిన ఇతర వార్తలలో, స్వదేశీ SUV తయారీదారు మహీంద్రా రాబోయే వారాల్లో XUV400 ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. ఇది 39.5kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్న మొట్టమొదటి స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ మహీంద్రా SUV ఇది. మహీంద్రా ఈ మోడల్ తన సెగ్మెంట్‌లో సుదీర్ఘ శ్రేణిని అందిస్తుందని పేర్కొంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 456 కి.మీ. మైలేజీని అందిస్తుంది. ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ SUVగా పేరు సంపాదించనుంది. ఈ వాహనం 8.3 సెకన్లలో సున్నా నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. 
 

click me!