
బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో మంగళవారం భారతదేశంలో బంగారం ధరలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఆగస్టు ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.50,642 వద్ద ట్రేడవుతున్నాయి. సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.238 లేదా 0.42 శాతం తగ్గి రూ.56,630కి చేరుకుంది. రాయిటర్స్ ప్రకారం 20 సంవత్సరాలలో US డాలర్ గరిష్ట స్థాయికి బలపడటంతో, గ్రీన్‌బ్యాక్-ధర బులియన్‌కి డిమాండ్‌ను తగ్గించడంతో ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్పాట్ బంగారం 0.1% క్షీణించి ఔన్సుకు 1,732.17 డాలర్ల వద్ద ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1% తగ్గి 1,730.80 డాలర్లకి చేరాయి.
ఈరోజు 12 జూలై 2022 (GST, TCS, ఇతర లెవీలు మినహా) 22 క్యారెట్ల బంగారం ఇండెక్స్ ధర
చెన్నై: రూ 46,720
ముంబై: రూ 46,850
ఢిల్లీ : రూ 46,850
కోల్‌కతా: రూ. 46,850
బెంగళూరు : రూ 46,880
హైదరాబాద్: రూ. 46,850
అంతర్జాతీయంగా విలువైన లోహం ధరలు క్షీణించిన నేపథ్యంలో సోమవారం దేశ రాజధానిలో బంగారం ధర 10 గ్రాములకు రూ.114 తగ్గి రూ.50,561కి చేరుకుంది. క్రితం ట్రేడింగ్‌లో 10 గ్రాముల ధర రూ.50,675 వద్ద స్థిరపడింది. వెండి కూడా గత ట్రేడింగ్‌లో కిలో రూ.56,896 నుంచి రూ.136 తగ్గి రూ.56,760కి చేరింది.
రాష్ట్ర పన్నులు, ఎక్సైజ్ సుంకం, మేకింగ్ ఛార్జీలు వంటి ప్రధాన అంశాల కారణంగా పసిడి ధర ప్రతిరోజూ మారుతుంటుంది. జూలై 12 మంగళవారం నాడు దేశంలోని కొన్ని నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950 . కాగా, చెన్నైలో రూ.46,800కు కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు.
24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే కోల్‌కతా, న్యూఢిల్లీ, ముంబైలలో అత్యధికంగా డిమాండ్ ఉన్న 10 గ్రాముల పసిడి ధర రూ.51,210. చెన్నైలో రూ.51,050కి లభిస్తుంది.
హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950కిగా ఉంది.