
ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా CEO ఎలోన్ మస్క్, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌తో 44 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. దీంతో మస్క్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ ప్రకటించింది. ఆ ప్రభావం మార్కెట్లో ట్విట్టర్ షేర్లపై పడింది. దీంతో ఈ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ షేర్లలో క్రమంగా క్షీణత కనిపిస్తోంది.
ట్విట్టర్ మార్కెట్ విలువ 2.2 బిలియన్ డాలర్లు క్షీణించింది
మనీకంట్రోల్ రిపోర్టు ప్రకారం, ట్విట్టర్ షేర్లు శుక్రవారం 6 శాతం పడిపోయిన తర్వాత సోమవారం ప్రీ-మార్కెట్ ట్రేడ్‌లో 7.8% వరకు పడిపోయాయి. సుమారు 33.93 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. సోషల్ మీడియా కంపెనీ మార్కెట్ విలువ 2.2 బిలియన్ డాలర్లు పడిపోయింది. అటు టెస్లా షేర్లు సైతం దాదాపు 6 శాతం పతనమై 702.54 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
మస్క్ ట్విట్టర్ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకున్నాడు.
ట్విట్టర్‌లో నకిలీ ఖాతాల గురించి సమాచారాన్ని అందించడంలో విఫలమైందని ఎలాన్ మస్క్ న్యాయవాది రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపారు. సంస్థ వ్యాపార పనితీరుకు ఇది చాలా ముఖ్యమైనదని. ఒప్పందంలోని అనేక షరతులను నెరవేర్చడంలో మైక్రో-బ్లాగింగ్ సైట్ విఫలమైందని ఫైలింగ్‌లో కూడా పేర్కొంది. .
ఎలోన్ మస్క్‌పై దావా వేయడానికి ట్విట్టర్ సిద్ధం..
మస్క్ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని కొనసాగించడానికి న్యాయపరంగా దావా వేయనున్నట్లు ట్విట్టర్ తెలిపింది. గత నెలలో, మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను 44 బిలియన్లకు కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందాన్ని ఆమోదించాలని ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది.
ట్విట్టర్ బోర్డు ఛైర్మన్ బ్రెట్ టేలర్ ట్వీట్ ప్రకారం: " మా కంపెనీ బోర్డు మస్క్‌తో ధర, నిబంధనలపై అంగీకరించి ఒప్పందాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది. మస్క్ తో విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది". అని పేర్కొన్నారు.
అయితే ఎలాన్ మస్క్ తమను మార్కెట్లో కొట్టిన దెబ్బకు గట్టిగా బదులు ఇవ్వాలని ట్విట్టర్ నిర్ణయించుకుంది. దీంతో మస్క్ ను అంత తేలికగా విడిచిపెట్టకూడదని నిర్ణయించుకుంది. మీడియా నివేదికల ప్రకారం, ట్విట్టర్ దీని కోసం న్యూయార్క్ టాప్ లీగల్ సంస్థ Wachtell, Lipton, Rosen & Karz LLPని నియమించుకుంది. వచ్చే వారం డెలావేర్‌లో మస్క్‌పై ట్విట్టర్ దావా వేయనుంది. ఈ న్యాయ పోరాటంలో తనను తాను రక్షించుకోవడానికి మస్క్ స్వయంగా సన్నాహాలు చేసుకుంటున్నాడు. అతను న్యాయ సంస్థ క్విన్ ఇమాన్యుయెల్ ఉర్కర్ట్ అండ్ సుల్లివన్‌ని నియమించుకున్నాడు.