రికార్డ్ స్థాయి నుండి 9 వేలు పడిపోయిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే ?

By S Ashok KumarFirst Published May 6, 2021, 5:06 PM IST
Highlights

 బంగారం ధరలు రికార్డ్ స్థాయి నుండి 9 వేలు దిగోచ్చి 10 గ్రాములకు 47,108 వద్దకు చేరుకుంది. వెండి కూడా రికార్డు స్థాయి కంటే 10,100 రూపాయలు తక్కువగా ఉంది. 

 కరోనా  సెకండ్ వేవ్, ఆర్థిక అనిశ్చితుల మధ్య బంగారం ధరలు కాస్త హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.  నేడు జూన్ ఫ్యూచర్స్ ఎంసిఎక్స్ లో బంగారం ధర 0.23 శాతం పెరిగి 10 గ్రాములకు 47,108 వద్దకు చేరుకుంది. వెండి ధర కిలోకు  0.27 శాతం పెరిగి రూ .69,809 కు చేరుకుంది.

గత ఏడాది 2020లో బంగారం ధర 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.56,200 చేరుకుంది. అయితే  అప్పటి  అత్యధిక స్థాయి ధరతో పోల్చితే  రూ.9,100 దిగోచ్చింది.  వెండి కూడా రికార్డు స్థాయి ధర కంటే రూ.10,100 తక్కువగా ఉంది.  

నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం రూ.43వేల 900గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 74,200గా ఉంది. బుధవారంతో పోల్చితే రూ.వెయ్యి 300 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.740గా ఉంది. 

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తుండటంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్  ఆంక్షలు విధించబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో  ఆర్థిక కార్యకలాపాలు మందగించే ప్రమాదం ఉంది. ఆర్థిక అనిశ్చితి ఉన్న ఈ కాలంలో బంగారంలో పెట్టుబడులు పెరుగుతాయి. ఎందుకంటే ప్రజలు దీనిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. కాబట్టి మీరు బంగారం కొనాలనుకుంటే ఇదే మంచి అవకాశంహ భావిస్తున్నారు.  

 బంగారు ధర, 06 మే 2021- మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గురువారం బంగారం ధర 115 రూపాయలు పెరిగింది. ఈ రోజు జూన్ ఫ్యూచర్స్ బంగారం 0.23 శాతం పెరిగి 10 గ్రాములకు 47,108 వద్ద ట్రేడవుతోంది.

also read కరోనా వల్ల వారే ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయారు.. ఇప్పుడు పిల్లలను చూసుకోవటానికి సమయం కేటాయిస్తున్నారు...

 వెండి ధర, 06 మే 2021 - మరోవైపు వెండి గురించి మాట్లాడితే వెండి ధరలు కూడా ఎం‌సి‌ఎక్స్ పై పెరుగుదలను నమోదు చేశాయి. మే నెలలో వెండి ధర 0.27 శాతం పెరిగి కిలోకు 69,809 రూపాయలకు చేరుకుంది. 

బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ ప్రకారం డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి విలువ క్షీణించడం వల్ల భారత మార్కెట్లలో బంగారం ధర పెరిగిందని అలాగే  కరోనా వైరస్ కొత్త కేసుల పెరుగుదల కారణంగా ప్రజలు మళ్లీ సురక్షిత పెట్టుబడి ఎంపిక వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉండొచ్చు అని అన్నారు.

మీరు బంగారం  స్వచ్ఛతను తనిఖీ చేయాలనుకుంటే, దీని కోసం ప్రభుత్వం ఒక యాప్ రూపొందించింది. 'బిఐఎస్ కేర్ యాప్' తో కస్టమర్ వినియోగదారుల  బంగారం స్వచ్ఛతను  తనిఖీ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు బంగారం  స్వచ్ఛతను తనిఖీ చేయడమే కాకుండా దీనికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఈ యాప్ లో వస్తువుల లైసెన్స్, రిజిస్ట్రేషన్, హాల్‌మార్క్ నంబర్ తప్పుగా కనిపిస్తే వినియోగదారులు వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.  

click me!