వరుసగా 3వ రోజు కూడా పెరిగిన ఇంధన ధరలు.. నేడు లీటరు పెట్రోల్ ధర ఎంతంటే ?

By S Ashok KumarFirst Published May 6, 2021, 10:56 AM IST
Highlights

దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత , ద్రవ్యోల్బణం పెరుగుతున్న దశ కొనసాగుతోంది. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడవ రోజుకూడా చమురు కంపనీలు పెంచాయి.

దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు వరుసగా 3వ రోజు కూడా ఇంధన ధరలను సవరించాయి. పెట్రోల్ ధర 35 నుంచి 44 పైసలకు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 45 నుంచి 51 పైసలకు పెరిగింది. మంగళవారం ఢీల్లీలో పెట్రోల్ ధర  లీటరుకు రూ.90.55 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.80.91.

ముంబైలో పెట్రోల్ ధర రూ .96.95, డీజిల్ ధర లీటరుకు రూ .87.98. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర లీటరుకు రూ.100 దాటింది. గత మూడు రోజుల్లో వరుసగా పెట్రోల్ 62 పైసలు, డీజిల్ లీటరుకు 69 పైసలు పెరిగింది.

నగరం    డీజిల్    పెట్రోల్
ఢీల్లీ         81.42    90.99
ముంబై    88.49    97.34
కోల్‌కతా    84.26    91.14
చెన్నై      86.35    92.90
హైదరాబాద్     88.46                94.34
 
ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు ఇంధన  ధరలను సవారిస్తుంటారు. కొత్త ధరలు  ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తరువాత దాని ధర  దేశంలో దాదాపు రెట్టింపు అవుతుంది.

also read 

ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం విదేశీ మారకపు రేట్ల మార్పులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా దేశీయ ఇంధన ధరలను ప్రపంచ ముడి చమురు ధరలతో సమం చేస్తాయి.  

ప్రపంచంలోని అతిపెద్ద చమురు వినియోగదారు అయిన యునైటెడ్ స్టేట్స్లో గ్యాసోలిన్ ఇన్వెంటరిస్  వరుసగా 5వ వారం పెరగడంతో చమురు ధరలు గురువారం పడిపోయాయి.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్  ఫ్యూచర్స్ 16 సెంట్లు లేదా 0123 జిఎంటి నాటికి 0.2 శాతం తగ్గి బ్యారెల్ 68.80 డాలర్లకు చేరుకుంది. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) క్రూడ్ ఫ్యూచర్స్ 20 సెంట్లు లేదా 0.3 శాతం తగ్గి బ్యారెల్ 65.43 డాలర్లకు పడిపోయింది. బ్రెంట్ అండ్ యుఎస్ క్రూడ్ ఫ్యూచర్స్ రెండూ మార్చి మధ్య నుండి బుధవారం  ముందు గరిష్ట స్థాయిని తాకింది.

click me!