భగభగమంటున్న బంగారం ధరలు.. సామాన్యుడికి భారంగా స్వర్ణం..

By Sandra Ashok KumarFirst Published Aug 8, 2020, 11:39 AM IST
Highlights

 శ్రవణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ ఏర్పడింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం శుక్రవారం వరుసగా 16వ సెషన్‌లో బంగారం ధర పెరిగి 10 గ్రాములకు 57,008 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. వెండి ధర కూడా ఎగిసి పడుతుంది, వెండి ధర కిలోకు 77,840 రూపాయల రికార్డు స్థాయిని తాకింది. 

బంగారం సామాన్యుడికి కొనడానికి భారంగా మారింది. వరుసగా బంగారం, వెండి ధరలు రోజు రోజుకి పెరుగుతూ నేడు మరో కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. శ్రవణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ ఏర్పడింది.

హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం శుక్రవారం వరుసగా 16వ సెషన్‌లో బంగారం ధర పెరిగి 10 గ్రాములకు 57,008 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. వెండి ధర కూడా ఎగిసి పడుతుంది, వెండి ధర కిలోకు 77,840 రూపాయల రికార్డు స్థాయిని తాకింది. వెండి ధర గురువారంతో పోలిస్తే కిలోకు 576 రూపాయలు పెరిగిం 77,264 రూపాయలకు చేరుకుంది.

మునుపటి ట్రేడ్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ .57,002 వద్ద ముగిసింది. శుక్రవారం ధర 10 గ్రాములకు రూ.6 పెరిగి రూ .57,008 కు చేరుకుంది. వెండి, బంగారం రెండు లోహాల ధరలు ఎప్పటికప్పుడు అధికంగా ఉన్నాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది.

also read 

ఢీల్లీలో 24 క్యారెట్లకు స్పాట్ బంగారం ధరలు 6 రూపాయలు పెరగడం ద్వారా కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. భారతదేశంలో వరుసగా 16వ రోజు బంగారం ధరలు అధికంగా ట్రేడవుతున్నాయి" అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ చెప్పారు.

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్ రీసెర్చ్) నవనీత్ దమాని మాట్లాడుతూ “బంగారం, వెండి మరో ఆల్ టైమ్ హైకి చేరింది ”అని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరగడం, ఆర్థిక అనిశ్చితితో మదుపుదారులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో బులియన్‌ మార్కెట్‌లో ఈవారం బంగారం పదేళ్ల గరిష్టస్ధాయిలో భారీగా లాభపడిందని రాయ్‌టర్స్‌ పేర్కొంది.
 

click me!