Gold And Silver Price Today: నేడు బంగారం, వెండి కొనే ప్లాన్ ఉందా.. అయితే ధ‌ర‌లివే తెలుసుకోండి..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 14, 2022, 08:38 AM IST
Gold And Silver Price Today: నేడు బంగారం, వెండి కొనే ప్లాన్ ఉందా.. అయితే ధ‌ర‌లివే తెలుసుకోండి..!

సారాంశం

బంగారం ధరలు ఎలా ఉన్నాయి? తగ్గాయా.. పెరిగాయా? నిన్న స్వల్పంగా పైకి చేరిన పసిడి రేటు  మంగళ‌వారం మాత్రం నిలకడగానే కొనసాగింది. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో జూన్ 14న 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 48,360 వద్దనే ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర అయితే పది గ్రాములకు రూ. 52,760 వద్ద కొనసాగుతోంది.   

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నిన్నటితో పోలిస్తే నేడు స్థిరంగా ఉంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణం తర్వాత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.200 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.48,360గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.52,760గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.67,300గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు మంగళ‌వారం ఈ విధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళ‌వారం (జూన్ 14, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..! 

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,760గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,430 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,830గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,360 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,760 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,360 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,760గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,360 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,760గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,500 ఉండగా, ముంబైలో రూ.61,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,300 ఉండగా, కోల్‌కతాలో రూ.61,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,300 ఉండగా, కేరళలో రూ.67,300గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,300 ఉండగా, విజయవాడలో రూ.67,300 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Price: ఓరి నాయనో..ఇవెక్కడి రేట్లురా బాబు,ఇక కొనగలమా?
Credit card: మీకు క్రెడిట్ కార్డు ఉందా.? ఏప్రిల్ 1 నుంచి మార‌నున్న రూల్స్ తెలుసుకోవాల్సిందే