నిండా ముంచేసిన LIC Stocks, ముగిసిన యాంకర్ ఇన్వెస్టర్ల లాక్ ఇన్ పీరియడ్, ఇక రక్త కన్నీరే...

Published : Jun 13, 2022, 11:48 PM IST
నిండా ముంచేసిన LIC Stocks, ముగిసిన యాంకర్ ఇన్వెస్టర్ల లాక్ ఇన్ పీరియడ్, ఇక రక్త కన్నీరే...

సారాంశం

ఏ ముహూర్తాన LIC IPO ప్రకటించారో అప్పటి నుంచి ఈ షేరు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తూనే ఉంది. ఐపీవో ప్రారంభంలోనే మార్కెట్లకు ఉక్రెయిన్ యుద్ధ సెగ తగిలింది. ఆ తర్వాత ఎట్టకేలకు పబ్లిక్ ఇష్యూ ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. అయితే రూ.6 లక్షల కోట్ల మార్కెట్ వ్యాల్యూయేషన్‌తో దేశంలోనే అతిపెద్ద ఐపీవో గా చరిత్ర సృష్టించిన ఎల్ఐసీ ఇన్వెస్టర్లను రక్త కన్నీరు పెట్టిస్తోంది. వరుసగా 10వ సెషన్ అయిన సోమవారం  ఎల్ఐసీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి.

ఈ రోజు LIC Stock వరుసగా 10వ రోజు పతనమై రూ.682కి పడిపోయింది. శుక్రవారం ఈ షేరు రూ.710 వద్ద ముగిసింది. లిస్టింగ్ అయినప్పటి నుంచి ఈ స్టాక్ క్షీణిస్తూ ప్రతిరోజు రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పుడు స్టాక్ ఇప్పుడు దాని ఇష్యూ ధర అంటే IPO ధర కంటే 28 శాతం బలహీనంగా ట్రేడవుతోంది.

ఈరోజు, యాంకర్ ఇన్వెస్టర్లకు 30 రోజుల లాక్-ఇన్ వ్యవధి ముగిసింది. దీంతో మంగళవారం కూడా స్టాక్‌లో మరింత భారీ పతనం నమోదయ్యే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ఎందుకుంటే రేపటి నుంచి యాంకర్ ఇన్వెస్టర్లు LIC షేర్లను జోరుగా విక్రయించే అవకాశం ఉంది.

యాంకర్ ఇన్వెస్టర్లకు 30 రోజుల లాక్-ఇన్ పీరియడ్ నేటితో అంటే జూన్ 13తో ముగిసింది. ఇప్పుడు వారు కూడా తమ షేర్లను ఈజీగా విక్రయించగలుగుతారు. యాంకర్ ఇన్వెస్టర్లకు లాక్-ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత, స్టాక్ పతనంపై మరింత భయం పెరిగింది. ఈ భయంతో నేడు స్టాక్‌లో భారీ పతనం చోటు చేసుకుంది. షేరు ధర కూడా రూ.700 దిగువకు పతనమై ఏకంగా రికార్డు స్థాయిలో రూ.682కి చేరింది.

IPOకి ముందు, యాంకర్ ఇన్వెస్టర్లు LICకి చెందిన 5.93 కోట్ల షేర్లను రూ. 949 ధరతో కొనుగోలు చేశారు. వీటిలో ఎక్కువ భాగం మ్యూచువల్ ఫండ్స్, ఇవి  గణనీయమైన నష్టాలను చవిచూస్తున్నాయి.

1.66 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము గంగపాలు..
స్టాక్‌లోని ఇన్వెస్టర్లు నిరంతరం నష్టపోతున్నారు మరియు లిస్టింగ్ నుండి వారు 1.66 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు. నేటి వ్యాపారంలో LIC మార్కెట్ క్యాప్ 4.34 లక్షల కోట్లకు పడిపోయింది. గత వారం శుక్రవారం 4.50 లక్షల కోట్లు, బుధవారం 4.68 లక్షల కోట్లు, మంగళవారం దాదాపు 4.76 లక్షల కోట్లు క్లోజయ్యాయి. అంటే, ఇది నిరంతరం తగ్గుతోంది. అదే సమయంలో, IPO సమయంలో కంపెనీ వాల్యుయేషన్ 6 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎల్‌ఐసీ ఇన్వెస్టర్లు 1.64 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.

నిపుణులు ఏమంటున్నారు...
స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎల్‌ఐసీ షేర్ల పతనం ప్రస్తుత ధర నుంచి పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. దీర్ఘకాలికంగా స్టాక్‌పై ఎలాంటి ఆందోళన లేదు. ఏమైనప్పటికీ, భీమా అనేది దీర్ఘకాలిక వ్యాపారం, కాబట్టి ప్రయోజనాలు కాలక్రమేణా పొందుతారు. 30 రోజుల యాంకర్ ఇన్వెస్టర్  లాక్-ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత ఇది ఈ రోజు మొదటి రోజు ట్రేడింగ్ అవుతోంది. స్టాక్‌లో నేటి పతనం దీనికి బలమైన మద్దతు స్థాయిగా మారవచ్చు.

ఎల్‌ఐసి ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి. తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. భారతదేశంలో బీమా రంగంలో భారీ వృద్ధికి అవకాశం ఉందని ఆయన చెప్పారు. జనాభా ప్రకారం, ఇప్పటికీ చాలా తక్కువ మంది మాత్రమే బీమా ఉత్పత్తులను కలిగి ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, కంపెనీ రంగం వృద్ధి ప్రయోజనం పొందుతుంది.

అయితే, ప్రైవేట్ బీమా కంపెనీలకు మార్కెట్ వాటాను కోల్పోతుండడం ఎల్‌ఐసీని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే కంపెనీ లాభదాయకత తక్కువగా ఉండగా, ఆదాయ వృద్ధి కూడా మందకొడిగా ఉంది. తక్కువ VNB మార్జిన్లు మరియు స్వల్పకాలిక నిలకడ నిష్పత్తి కూడా ఆందోళన కలిగించే విషయం.

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !