తస్మాత్ జాగ్రత్త: వచ్చేనెలలో పెట్రోల్, డీజిల్ ధరల మోత.. లీటర్ పై భారీగా పెంపు..

By Sandra Ashok Kumar  |  First Published May 29, 2020, 10:38 AM IST

కరోనాతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయంగా తగ్గినా దేశీయంగా ఎటువంటి మార్పు లేదు.. కానీ ప్రస్తుతం వివిధ దేశాలు ఆంక్షలను సడలిస్తుండటంతో పెట్రోల్ వినియోగం క్రమంగా పెరిగితే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరుగుతుంది. అదే జరిగితే దేశీయంగానే తడిసి మోపెడు కానున్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం లీటర్ పెట్రోల్, డీజిల్ లపై కేంద్ర చమురు సంస్థలు రూ.4-5 నష్టపోతున్నాయని వినికిడి. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు వచ్చేనెల మొదటి వారంలో రూ.4-5 మధ్య పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచనున్నాయి. 
 


న్యూఢిల్లీ: వచ్చేనెల నుంచి వినియోగదారులపై పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగనున్నది. కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ జూన్ నెలలో పూర్తిగా ఎత్తేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు రోజువారీ ధరలను పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. 

పెట్రోలియం సంస్థల అధికారుల కథనం ప్రకారం వాటి ధరలు రూ.4-5 పెరుగనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థల అధికారులు, రిటైలర్లు సమావేశమైనట్లు సమాచారం. కరోనా లాక్ డౌన్ తర్వాత రోజువారీ ధరలను పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారని వినికిడి. 

Latest Videos

దేశవ్యాప్తంగా విశ్వమారి నియంత్రణలోకి వచ్చినా మెట్రోపాలిటన్ నగరాలతోపాటు పారిశ్రామిక ప్రాంతాలు గల 13 సిటీల్లో దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. వలస కార్మికులు సొంతూళ్లకు పెరిగిపోయిన తర్వాత కూడా వారి సొంత రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ఆందోళనకరమైనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.

ఆయా నగరాల పరిధిలో కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేస్తున్న నేపథ్యంలో ఐదో దశ లాక్ డౌన్ అమలు సమయంలో భారీ నష్టాలను తగ్గించడానికి రోజువారీ పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పాక్షికంగా పెంచుకునేందుకు కేంద్ర చమురు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వనున్నట్లు వినికిడి. ఐదో దశ లాక్ డౌన్ అమలులో నియంత్రణకు మార్గదర్శకాలు కొనసాగుతున్నా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. 

కేంద్ర చమురు సంస్థ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘గత నెల ధరలతో పోలిస్తే ఆయిల్ మార్కెట్ ఈ నెల 50 శాతానికి పైగా లబ్ధి పొందే అవకాశం ఉంది.  ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 30 డాలర్లుగా ఉంది. ఇక నుంచి పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ధరల పెరుగుదల కొనసాగితే ఈ నెల ప్రారంభంలో పెంచిన ఎక్సైజ్ సుంకం కలిసిపోయి నష్టాలు మొదలవుతాయి. కరోనా నేపథ్యంలో ఆటోమొబైల్ సేల్స్ పడిపోయాయి’ అని గుర్తు చేశారు. 

also read  ‘జియో’లో పెట్టుబడులకు మరో 2 సంస్థలు: నెరవేరనున్న ముకేశ్ అంబానీ ఆకాంక్ష...

ఇప్పటికే మార్కెట్లో అమలవుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై వాస్తవ ధరలతో లీటర్ మీద 4-5 అంతరాయం ఉంది. ఇది ఎక్కువ కాలం కొనసాగినా.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగక పోయినా పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని వారాల పాటు రోజుకు 40-50 పైసలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ప్రభుత్వ వర్గాలు మాత్రం రిటైల్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అనుమతించే అవకాశాలు లేవని సంకేతాలిచ్చాయి. రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరలు 20-40 పైసలు పెరిగే అవకాశాలు మాత్రమే ఉన్నాయని ఆ వర్గాల అంచనా. ఈ అంతరాయాన్ని చమురు సంస్థలకు సర్దుబాటు చేసే వెసులుబాటు ఉందని ఆ వర్గాలు తెలిపాయి. 

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గత నెలతో పోలిస్తే 50 శాతానికి పైగా పెరిగాయి. గత నెల బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ మీద 20 డాలర్లు పలికింది. ఇది ప్రస్తుతం 30 డాలర్లు దాటింది. లాక్ డౌన్ కొనసాగడం కూడా ఆటోమొబైల్ సంస్థల ఇంధన ధరలను నియంత్రిస్తోంది. ఇది కొనసాగినంత కాలం పెట్రోలియం ధరలను కొంత నియంత్రిస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. 

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 71.26 పలుకుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ.69.39 కొనసాగుతోంది. ఇంతకుముందు మార్చి 16 నుంచి మే నాలుగో తేదీ వరకు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.69.59,  రూ.62.28గా కొనసాగాయి. ఢిల్లీలో కరోనాను కట్టడి చేయడానికి అవసరమైన రెవెన్యూ పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలపై వ్యాట్ సవరించింది. 

రిటైల్ మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరగడం కేంద్ర చమురు సంస్థలకు చాలా ముఖ్యమే. ఇంతకుముందు పెట్రోల్ ధరలపై ఎక్సైజ్ సుంకం పెరిగినా కేంద్ర చమురు సంస్థల లాభాలు గత గత త్రైమాసికంలో గణనీయ స్థాయిలో లీటర్‌పై రూ.12-18 వరకు పడిపోయాయి. మరోవైపు ముడి చమురు వినియోగం గత నెలలో 50 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. 
 

click me!