అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ట్విట్టర్‌పై విరుచుకుపడిన తరువాత, ట్విట్టర్ సిఇఒ జాక్ డోర్సే రాబోయే అధ్యక్ష ఎన్నికల గురించి తప్పుడు వార్తలు లేదా వివాదాస్పద సమాచారాన్ని ఎత్తి చూపుతూనే ఉంటుంది. మేము ఏవైనా తప్పులు చేస్తే అంగీకరించి వాటిని సరిచేసుకుంటాము’ అని డోర్సే పేర్కొన్నారు.
న్యూ ఢిల్లీ: రాబోయే అధ్యక్ష ఎన్నికల గురించి తప్పుడు సమాచారాన్ని హైలైట్ చేయాలన్న తన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సామాజిక మాధ్యమం ట్విటర్ మధ్య ట్వీట్‌ల వార్ కొనసాగుతోంది. దీనిపై ట్విట్టర్ సిఇఒ జాక్ డోర్సే సమదానమిచ్చారు.
వరుస ట్వీట్లలో జాక్ డోర్సే మాట్లాడుతూ, ‘మేము అధ్యక్ష ఎన్నికల గురించి తప్పుడు సమాచారం లేదా వివాదాస్పద సమాచారాన్ని ఎత్తి చూపుతూనే ఉంటాము. మేము ఏవైనా పొరపాట్లను చేసి ఉంటే అంగీకరించి వాటిని సరిచేసుకుంటాము. ఫ్యాక్ట్ చెకింగ్ అనేది మమ్మల్ని సత్యానికి మధ్యవర్తిగా చేయదు.
undefined
మా ఉద్దేశ్యం విరుద్ధమైన ప్రకటనల గుర్తించి, వివాదంలో ఉన్న సమాచారాన్ని ఎత్తిచూపడం మాత్రమే. తద్వారా ప్రజలు తమకు తాముగా ఏది సత్యమో, అసత్యమో తెలుసుకోవొచ్చు. మా నుండి మరింత పారదర్శకత చాలా కీలకం, కాబట్టి మా చర్యల వెనుక ఉన్న కారణాలను ప్రజలు స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది’’ అని జాక్ డోర్సే ట్వీట్ చేశారు.
మిచిగాన్, నెవాడా వంటి ఇంతర యుఎస్ రాష్ట్రాలు ఎన్నికల సమయంలో సామూహిక లేదా బహిరంగ సమావేశాలను నివారించడానికి, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ‘మెయిల్-ఇన్’ ఓటింగ్ విధానం లేదా పోస్టల్ ఓటింగ్‌ను పరిశీలిస్తున్నాయి.
ఈ పద్ధతిలో బ్యాలెట్లు ఓటర్లకు పంపిణీ చేస్తారు తరువాత అది పోస్ట్ ద్వారా తిరిగి పంపిస్తారు. ఎన్నికలకు ఎవరైనా వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదు. ఈ రాష్ట్రాల్లో నమోదైన ఓటర్లకు మెయిల్-ఇన్ ఓటింగ్ హక్కు కూడా ఉంది. రాష్ట్ర నిర్ణయంలో ట్రంప్ చట్టబద్ధంగా జోక్యం చేసుకోలేరు.
also read కరోనా ఎఫెక్ట్: బోయింగ్‌లో వేలాది మంది ఉద్యోగుల తొలగింపు...?
ట్రంప్ చేసిన ట్వీట్లు రెండింటి కింద ‘నిజానిజాలు నిర్ధారించుకోవాల్సి ఉంది’ అనే ట్యాగ్‌ను ట్విటర్ తగిలించడం ట్రంప్‌కు కోపం తెప్పించిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్లతో అవకతవకలు జరిగే చాన్సుందని ట్రంప్ మంగళవారం ఒక ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌కు కింద నీలిరంగులో ఒక చిహ్నాన్ని ట్విట్టర్ తగిలించింది. అంటే అందులోని నిజానిజాలను నిర్ధారించుకోవాల్సి ఉందని దాని అర్థం. దీంతో ట్రంప్‌కు కోపమొచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ జోక్యం చేసుకుంటోంది. మెయిల్ ఇన్ బ్యాలెట్లపై నా ప్రకటన సరికాదని వాళ్లు చెబుతున్నారు.
ఫేక్ న్యూస్ ప్రసారం చేసే సీఎన్‌ఎన్, అమెజాన్, వాషింగ్టన్ పోస్ట్‌ల ఆధారంగా నిజానిజాలను నిర్ధారించుకోమంటున్నారు’ అని ట్విటర్‌పై ట్రంప్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెయిల్-ఇన్ ఓటింగ్ కొనసాగితే మిచిగాన్ రాష్ట్రానికి ఫెడరల్ నిధులను నిలిపివేస్తామని ట్రంప్ బెదిరించారు. వరుస ట్వీట్లలో ఓటింగ్ పద్ధతిని ట్రంప్ విమర్శించారు.
ట్విట్టర్ కొత్త లేబుళ్ళను పెట్టిన వెంటనే, ట్రంప్ వాటిని కొట్టిపారేసి, 2020 అధ్యక్ష ఎన్నికలలో మైక్రోబ్లాగింగ్ సైట్ జోక్యం చేసుకుంటోందని ఆలా జరిగే లోపే వాటిని కట్టిడి చేసేందుకు, లేదా బంద్ చేసేందుకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.