కరోనా వైరస్ అరికట్టేందుకు ఫేస్‌బుక్‌ సంచలన నిర్ణయం...

By Sandra Ashok KumarFirst Published Mar 5, 2020, 10:15 AM IST
Highlights

కరోనా వైరస్ ఆటకట్టించేందుకు ప్రపంచమంతా ఏకమవుతున్నది. డబ్ల్యూహెచ్ఓకు మద్దతుగా ఉచిత వాణిజ్య ప్రకటనలు జారీ చేసేందుకు ఫేస్ బుక్ సిద్ధ పడింది. వర్ధమాన దేశాలు కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంకు దాదాపు రూ.88 వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. 

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను అరికట్టడానికి యావత్ ప్రపంచం ఏకమవుతున్నది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కరోనావైరస్‌పై వచ్చే పుకార్లు, తప్పుడు కథనాలు, వదంతులపై యుద్ధం చేయడంలో సాయం చేయనుంది.

ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థకోసం ఉచితంగా ప్రకటనలు ఇవ్వనుంది. మరోవైపు కరోనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది.

వినియోగదారులు తప్పుడు సమాచారం బారిన పడకుండా ఫేస్‌బుక్ ఈ చర్యలు తీసుకోనున్నట్లు ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌జుకర్‌బర్గ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘మేం మిగిలిన వారితో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరినన్ని వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధం.

also read ఎన్‌ఆర్‌ఐలకు ఎయిర్‌ ఇండియాలో 100శాతం వాటాను కొనుగోలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం...

ఎవరైనా వైరస్‌పై సమాచారం కోసం వెతుకుతుంటే వారికి ఒక పాపప్‌ వస్తుంది. అది వారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ, లేదా స్థానిక వైద్య అధికారుల సూచనలు ఉన్నచోటకి తీసుకెళుతుంది’’ అని జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. 

తమ  కంపెనీ తప్పుడు సమాచారాన్ని ఆన్‌లైన్‌ నుంచి తొలగిస్తుందని ఫేస్ బుక్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాటిని తొలగించే ఏర్పాట్లు చేస్తామని మార్క్‌ జుకర్ బర్గ్ చెప్పారు. వైద్యనిపుణులతో కలిసి ఫేస్‌బుక్‌ పనిచేస్తుంది. 

యాడ్‌క్రెడిట్స్‌ రూపంలో ఇతరులకు సహకరిస్తుందని మార్క్‌ జుకర్ బర్గ్ పేర్కొన్నారు. కరోనావైరస్‌ నుంచి  రక్షణకు, వ్యాధి తగ్గించేందుకు ఆఫర్‌ చేసే తప్పుడు వాణిజ్యప్రకటనలను తొలగిస్తామని ఫిబ్రవరిలోనే ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 93వేల మందికి ఈ వ్యాధి సోకిన విషయం తెలిసిందే. 

also read కరోనావైరస్ దెబ్బకు కుప్పకూలిన దేశీయ స్టాక్‌మార్కెట్లు...

కరోనా వైరస్‌తో పోరాడుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు తర్వితగతిన ఆర్థిక సహాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. 12 బిలియన్ డాలర్లతో (దాదాపు రూ.88 వేల కోట్లు) ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామని తెలిపింది. ప్రాథామిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ట పరచడం, వ్యాధి వ్యాప్తిని నిరోధించడం, హెల్త్ వర్కర్ల ట్రైనింగ్‌కు ఈ నిధులు కేటాయిస్తామని ప్రకటించింది.

మరోవైపు.. కరోనా ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడకుండా ఉండేందుకు ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయబోతున్నట్టు వరల్ఢ్ బ్యాంకు వెల్లడించింది.

సత్వర నిధులు అందుబాటులో ఉంచడం ద్వారా కరోనా ప్రభావాన్ని గణనీయంగా తగ్గించొచ్చని వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ తెలిపారు. ఈ విషయంలో వేగంగా స్పందించడం ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చని వ్యాఖ్యానించారు.

click me!