ఎన్‌ఆర్‌ఐలకు ఎయిర్‌ ఇండియాలో 100శాతం వాటాను కొనుగోలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం...

By Sandra Ashok Kumar  |  First Published Mar 4, 2020, 5:52 PM IST

ఎయిర్ ఇండియాలో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్‌ఆర్‌ఐ) 100 శాతం వాటాను కలిగి ఉండటానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు జవదేకర్ తెలిపారు


న్యూ ఢిల్లీ: సివిల్ ఏవియేషన్ రంగంలో విదేశీ పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం బుధవారం (మార్చి 4, 2020) ఆమోదించింది. నాన్-రెసిడెంట్ ఇండియాస్ (ఎన్‌ఆర్‌ఐ) 100 శాతం వరకు కొనుగోలు చేయడానికి వీలు కల్పించింది.  

కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయన్ని తీసుకున్నారు, తరువాత దీనిని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్  విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. జాతీయ క్యారియర్‌లో 100 శాతం వాటా అమ్మకాలను ప్రభుత్వం విక్రయించాలని చూస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తిసుకుంది.

Latest Videos

undefined

ఎయిర్ ఇండియాలో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్‌ఆర్‌ఐ) 100 శాతం వాటాను కలిగి ఉండటానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు జవదేకర్ తెలిపారు. క్యారియర్‌లో నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్‌ఆర్‌ఐ) 100 శాతం పెట్టుబడిని అనుమతించడం ఎస్‌ఓ‌ఈ‌సి నిబంధనలను ఉల్లంఘింగించినట్లు కాద్నన్నారు అలాగే ఎన్నారై పెట్టుబడులను దేశీయ పెట్టుబడులుగా పరిగణిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ లైన్ పరిశ్రమలో అనుసరిస్తున్న సబ్‌స్టాంటియల్ ఓనర్‌షిప్ అండ్ ఎఫెక్టివ్ కంట్రోల్ (SOEC) ఫ్రేమ్‌వర్క్ కింద, ఒక  దేశం నుండి విదేశాలకు ప్రయాణించే క్యారియర్ ఆ దేశ ప్రభుత్వం లేదా దాని జాతీయుల యాజమాన్యంలో ఉండాలి.

ప్రస్తుతం ఎన్నారైలు ఎయిర్ ఇండియాలో 49 శాతం వాటని మాత్రమే పొందగలరు. ప్రభుత్వ అనుమతి ద్వారా విమానయాన సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) కూడా 49 శాతం మాత్రమే.

ప్రస్తుత నిబంధనల ప్రకారం కొన్ని షరతులకు లోబడి షెడ్యూల్ చేసిన దేశీయ క్యారియర్‌లలో 100 శాతం ఎఫ్‌డిఐలు అనుమతించబడతాయి. విదేశీ విమానయాన సంస్థలకు ఇది వర్తించదు.

షెడ్యూల్ చేసిన విమానయాన సంస్థల విషయంలో, ఆటోమేటిక్ అప్రూవల్ రూట్ ద్వారా 49 శాతం ఎఫ్‌డి‌ఐకి అనుమతి ఉంది. కాకపోతే ఆ స్థాయికి మించిన పెట్టుబడికి పెట్టాలనుకుంటే ప్రభుత్వ అనుమతి అవసరం.

జనవరి 27న, ఎయిర్ ఇండియా పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రాథమిక సమాచార మెమోరాండం (పిమ్) తో ముందుకు వచ్చింది. బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో సమానమైన జాయింట్ వెంచర్‌గా ఉన్న ఐసాట్స్‌లో జాతీయ క్యారియర్ 50 శాతం వాటాను విక్రయించాలని ప్రతిపాదించింది.

తాజా పెట్టుబడుల ప్రణాళిక ప్రకారం, విజయవంతమైన బిడ్డర్ రూ .23,286.5 కోట్ల విలువైన రుణాన్ని మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. లావాదేవీలు ముగిసే సమయంలో ప్రస్తుత ఆస్తులను బట్టి బాధ్యతలు నిర్ణయించబడతాయి. చాలా కాలంగా నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను గట్టెకించడానికి ప్రభుత్వం కొద్ది సంవత్సరాలలో చేసిన రెండవ ప్రయత్నం ఇది.

ఇతర నిర్ణయాలలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగుగా విలీనం చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ముందుకు సాగింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల (పిఎస్‌బి) ను నాలుగుగా ఏకీకృతం చేసే విషయంలో ఉందని, విలీనం 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు.
 

click me!