వ్యాపారం మొదలు పెట్టే ముందు చాలా మందిలో వచ్చే మొదటి ఆలోచన ఎలాంటి బిజినెస్‌ను స్టార్ట్ చెయ్యాలి? మనసులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు పొందొచ్చనేది అందరికీ తెలిసినా విషయమే. మరి అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం..
ఎక్కువ ఆదాయం పొందాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి ఆదాయం ఎక్కువ రావాలంటే వస్తువులను ఉత్పత్తి చేసే కెపాసిటీ కూడా ఎక్కువగా ఉండాలి. అందుకే సహజంగానే పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. అయితే అలా కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే బిజినెస్ ఐడియాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.? అలాంటి వాటిలో కొబ్బరి బొండాల నుంచి కోకోపీట్ మేకింగ్ బిజినెస్ ఒకటి. ఇంతకీ ఏ బిజినెస్ ఏంటి.? ఎంత పెట్టుబడి అవుతుంది.? లాభాలు ఎలా ఉంటాయి లాంటి పూర్తి వివరాలు మీకోసం.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కోకోపీట్ మేకింగ్ మిషన్స్ అవసరపడతాయి. ఈ మిషిన్స్ సహాయంతో కొబ్బరి బోండాల నుంచి పీచును సెపరేట్ చేయొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా కేవలం కోకోపీట్ మిషిన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాడి పడేసిన కొబ్బరి బొండాలను సేకరించాలి. సహజంగా ఇవి కొబ్బరి బోండాల దుకాణ సమీపంలో, ఆసుపత్రుల సమీపంలో ఉండే చెత్త కుప్పల్లో ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిని పెద్ద ఎత్తున సేకరించేందుకు కొందరిని నియమించుకోవాల్సి ఉంటుంది. కొబ్బరి బొండల నుంచి సేకరించిన పీచుతో రకరకాల వస్తువులను తయారు చేస్తారు.
కొబ్బరి బొండాల నుంచి పీచును సేకరించడం చాలా సులభమైన పద్ధతి. కొబ్బరి బొండం నుంచి పీచును వెలికి తీసేందుకు మిషిన్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో కొబ్బరి బొండంను వేస్తే చాలు వెంటనే బయటకు ఫైబర్ వస్తుంది. దీనిని ఫైబర్ ఎక్ట్రాక్షన్ మిషిన్‌గా పిలుస్తారు. ఇలా వచ్చిన ఈ కోకోపిట్‌ను స్క్రీనింగ్ మిషిన్‌లో వేయాల్సి ఉంటుంది. కోకోపిట్‌లో ఏవైనా పెద్ద పెద్ద వస్తువులు ఉంటే వాటిని ఈ మిషిన్ సెపరేట్ చేస్తుంది. ఇలా సేకరించిన కొబ్బరి పీచును విల్లోయింగ్ అనే మిషిన్‌లో వేయాల్సి ఉంటుంది. ఇందులో వేస్తే మూడు విభిన్న పరిమాణాల్లో ఫైబర్ బయటకు వస్తుంది. ఈ ఫైబరే మనకు ఉపయోగపడుతుంది.
కొబ్బరి బొండంల నుంచి సేకరించిన ఈ ఫైబర్ సహాయంతో తాళ్లను తయారు చేయొచ్చు. ఇందుకోసం రోప్ మేకింగ్ మిషన్ ఉపయోగపడుతుంది. ఈ మిషిన్‌లో ఫైబర్ వేస్తే బయటకు తాడు తయారై బయటకు వస్తుంది. ఇక కొబ్బరి పీచుతో వినాయక విగ్రహాలను కూడా తయారు చేస్తారు. అదే విధంగా సోఫాసెట్ వంటి వాటిలో కూడా ఉపయోగిస్తారు. ఫ్లవర్ పాట్స్‌ను కూడా ఈ పీచుతో తయారు చేయొచ్చు. ఇలా కొబ్బరి పీచుతో ఇన్ని రకాల లాభాలు ఉంటాయి. సుమారు రూ. 10 లక్షల క్యాపిటల్‌తో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లాభాల విషయానికొస్తే తక్కువలో తక్కువ నెలకు రూ. 50 వేలకి పైగా ఆదాయం పొందొచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినది మాత్రమే. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే వారు అంతకు ముందు ఈ రంగంలో పెట్టుబడి పెట్టిన వారిని నేరుగా వెళ్లి సంప్రదించి, లాభనష్టాల గురించి చర్చించి మొదలు పెట్టడం మంచిది.