సేఫ్టీ, లగ్జరీ లుక్ కలిగిన బలెనో కొనాలను మీరు అనుకుంటే ఇప్పుడే కొనేయండి. లేదంటే ధర పెరిగిపోయిన తర్వాత కొంటే మీరే నష్టపోతారు. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో బడ్జెట్ ధరలో లభించే సుజుకి బలెనో కారు ఫీచర్లు, సామర్థ్యం గురించి తెలుసుకుందాం రండి.
2024 సంవత్సరం పూర్తయిపోతోంది. భారతదేశంలో అనేక కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి కూడా తన కార్లపై ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్లు అందిస్తోంది. ఎందుకంటే జనవరి 1, 2025 నుంచి తన కార్ల ధరలను పెంచనుంది. కంపెనీ ప్రముఖమైన, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బలెనో ధర కూడా పెరగనుంది. అందువల్ల మీరు బలెనో కొనాలని అనుకుంటే వెంటనే కొనేయండి.
బలెనో ధరను మారుతి సుజుకి 4% పెంచనుంది. ప్రస్తుతం బలెనో ఎక్స్ షోరూమ్ ధర రూ.6.66 లక్షల నుంచి రూ.9.83 లక్షల వరకు ఉంది. ఈ నేపథ్యంలో 4% పెరిగితే గరిష్టంగా రూ.26,640 నుంచి రూ.39,320 వరకు ధర పెరిగే అవకాశం ఉంది. కంపెనీ 4% కంటే తక్కువ పెంచితే ధర తక్కువగా పెరుగుతుంది.
బలెనో 1.2 లీటర్, నాలుగు సిలిండర్ K12N పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 83bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరో వేరియంట్ ఏంటంటే 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఇది 90bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. బలెనో CNGలో కూడా లభిస్తుంది. ఇది 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంది. ఇది 78bhp శక్తిని, 99Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇది కూడా చదవండి: https://telugu.asianetnews.com/gallery/business/reva-i-electric-car-a-comprehensive-guide-to-features-and-pricing-sns-sp5tef
బలెనో పొడవు 3990 మి.మీ., వెడల్పు 1745 మి.మీ., ఎత్తు 1500 మి.మీ., ఉంటుంది. అందువల్ల కారు లుక్ చాలా పెద్దగా కనిపిస్తుంది. వీల్‌బేస్ 2520 మి.మీ. ఉంటుంది. అందువల్ల గుంతల రోడ్డులో కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తుంది. కొత్త మోడల్ బలెనోలో AC వెంట్‌లు కూడా రీడిజైన్ చేశారు. ఇది ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. ఇది కచ్చితంగా 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
భద్రత కోసం మారుతి బలెనోలో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా మరింత సేఫ్టీ కోసం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-స్టార్ట్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, EBDతో ABS, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు ఉన్నాయి. వీటితో పాటు రివర్సింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. బలెనో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. మీ బడ్జెట్, ఫీచర్స్ ను బట్టి మీకు నచ్చిన వేరియంట్ ఎంచుకోవచ్చు.