మీరు చదువుకుంటున్నారా? డబ్బుల అవసరం ఉందా? స్టూడెంట్స్ కి కూడా పర్సనల్ లోన్ ఇస్తారని మీకు తెలుసా? ఈ లోన్ ఎవరు ఇస్తారు? ఎలా పొందాలి? తదితర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
చదువుకొనే విద్యార్థులకు కూడా డబ్బుతో అవసరం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు వారికి పాకెట్ మనీ ఇస్తుంటారు. అయితే ఆ డబ్బుతో చిన్న చిన్న సరదాలు, ఫుడ్ ఖర్చులు లాంటివి మాత్రమే తీరతాయి. మరి అంతకు మించి ఖర్చు పెట్టాల్సి వస్తే ఎక్కువ డబ్బు పేరెంట్స్ ఇవ్వలేరు కదా? అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు కూడా బ్యాంకులు పర్సనల్ లోన్స్ ఇస్తాయి.
సాధారణంగా ఎవరికైనా లోన్ కావాలంటే బ్యాంకులు ముందుగా అడిగేది మీ ఇక్ కమ్ సోర్స్ ఏంటని.. అయితే ఎటువంటి ఆదాయం లేని విద్యార్థులకు కూడా బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. వాటిని పొందాలంటే మీరు కొన్ని కండీషన్స్ ఒప్పుకోవాలి. ఆ నిబంధనల్లో ఉన్నట్టుగా మీ ప్రొఫైల్ ఉంటే బ్యాంకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అవసరమైన డబ్బును లోన్ రూపంలో ఇస్తుంది.
ఎటువంటి ఆస్తులు చూపించక్కరలేకుండా బ్యాంకులు విద్యార్థులకు పర్సనల్ లోన్స్ ఇస్తాయి. వీటిని మీరు వైద్య ఖర్చులు, అద్దె లేదా ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు. ఇవే కాకుండా ఈ డబ్బుతో మీకు నచ్చిన పని చేసుకోవచ్చు. అయితే ఈ లోన్ పొందాలంటే మీరు ఒక ముఖ్యమైన నిబంధన పాటించాల్సి ఉంటుంది.
స్టూడెంట్స్ పర్సనల్ లోన్ తీసుకోవానుకుంటే ముందుగా గ్యారెంటర్ సపోర్ట్ ఉండాలి. అంటే స్కూడెంట్ లోన్ కి తల్లిదండ్రులు గాని, ఉద్యోగం చేసే అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్ళు వీళ్లలో ఎవరైనా గ్యారెంటర్ గా సంతకం పెట్టాలి. అప్పుడు మీకు లోన్ ఇస్తారు.
ఇది కూడా చదవండి..
ఒక వేళ మీరే ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండటం, ఫ్రీలాన్సింగ్ చేయడం లాంటివి చేస్తుంటే లోన్ పొందడం ఇంకా సులభం.
స్టూడెంట్స్ కాబట్టి వారి దగ్గర నికర ఆదాయం ఉండదు. అంటే రెగ్యులర్ గా రోజుకు లేదా, నెలకు ఇంత జీతం అంటూ పొందడానికి వీలుండదు. అందుకే వారికి పేరెంట్స్ పాకెట్ మనీ ఇస్తుంటారు. కొందరు వాటిని ఎంజాయ్ మెంట్ కో వాడేస్తారు. కాలేజీల్లో పార్టీలు, టూర్లు, ఇతర సరదాల కోసం డబ్బులు ఖర్చుపెట్టేస్తారు. అయితే కాలేజీల్లో ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్, ప్రైవేటుగా స్పెషల్ కోర్సు నేర్చుకోవడం, ఇలాంటి వాటికి కాస్త ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి. ఇలాంటి సందర్భాల్లో మీరు లోన్ తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో మీ లోన్ కి గ్యారెంటీ సంతకం పెట్టిన వారు గ్యారెంటర్ అవుతారు. ఒక వేళ ఇబ్బందులు వచ్చి మీరు కట్టలేకపోతే గ్యారెంటర్ చెల్లించాల్సి ఉంటుంది.
స్టూడెంట్స్ కూడా గ్యారెంటర్ సహాయంతో పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. వీటిని అద్దె చెల్లించడానికి, హాస్పిటల్ బిల్లులకు, ఇలాంటి పర్సనల్ అవసరాలకు వాడుకోవచ్చు.
అదే ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా సుమారుగా ఇదే ప్రొసీజర్ ఉంటుంది. అయితే ఎడ్యుకేషన్ లోన్ ద్వారా వచ్చిన డబ్బును ట్యూషన్ ఫీజు చెల్లించడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి, ఇతర చదువుకు సంబంధించిన కోర్సులు చేయడానికి ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి..
విద్యార్థులు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే ID ప్రూఫ్ సమర్పించారు. అంటే ఆధార్, పాన్, ఓటర్ ID, పాస్ పోర్ట్ వీటిల్లో ఏదైనా ఇవ్వొచ్చు. అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్, పాన్, కరెంట్, గ్యాస్ బిల్ లాంటివి ఇవ్వాలి. వీటితో పాటు ఆదాయపు ధ్రువపత్రం ఇవ్వాలి. అంటే మీకు గ్యారెంటర్ గా ఉన్న వ్యక్తి బ్యాంక్ స్టేట్మెంట్లు సమర్పించాలి.
లోన్ ఇస్తున్నారు కదా అని అనవసర విషయాలకు లోన్ తీసుకోకండి. మీకు కచ్చితంగా అవసరం అనుకంటేనే లోన్ తీసుకోండి. ఎందుకంటే పర్సనల్ లోన్ కి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. మీరు కట్టలేని పరిస్థితులు ఏర్పడితే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.
సమయానికి లోన్ తిరిగి చెల్లించండి.