Elon Musk: మస్క్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది...ట్విట్టర్ బెదిరింపులకు కౌంటర్ ఇచ్చిన టెస్లా కింగ్..

Published : Jul 12, 2022, 01:05 PM IST
Elon Musk: మస్క్ తో  పెట్టుకుంటే మడతడి పోద్ది...ట్విట్టర్ బెదిరింపులకు కౌంటర్ ఇచ్చిన టెస్లా కింగ్..

సారాంశం

సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్, ట్విట్టర్ మధ్య మాటల యుద్ధం పుంజుకుంది. 

ట్విట్టర్ డీల్ రద్దు తర్వాత తనను కోర్టు కు ఈడుస్తామని ట్విట్టర్ బెదిరింపులకు మస్క్ కౌంటర్ చేశాడు. అంతేకాదు మస్క్ బెదిరింపులను ఎగతాళి చేశాడు.ఇంతటి వివాదాన్ని సృష్టించిన డీల్  రద్దు తర్వాత వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరగడం ఆసక్తికరమైన విషయంగా మారింది. మస్క్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో నవ్వుతున్న చిత్రాన్ని పంచుకోవడం ద్వారా ట్విట్టర్ బెదిరింపులను ఎగతాళి చేశాడు. 

మస్క్ ఇలా ట్వీట్ చేశాడు- 'నేను ఆ కంపెనీని కొనుగోలు చేయలేను. అలాగే వారు బాట్ (నకిలీ ఖాతా)లని బహిర్గతం చేయలేరని, అయితే వారు నన్ను కోర్టు ద్వారా ట్విట్టర్ కొనుగోలు చేయమని బలవంతం చేయాలనుకుంటున్నారు, అయితే ఇప్పుడు వారు కోర్టులో ఫేక్ లేదా నకిలీ అకౌంట్ల గురించి కూడా బహిర్గతం చేయాల్సి ఉంటుందని  అన్నారు.

మస్క్ చేసిన ట్వీట్ ఇప్పటివరకు దాదాపు 10 లక్షల లైక్‌లు మరియు 35 వేల సార్లు రీట్వీట్లు వచ్చాయి. ఈ ఒప్పందంలో పొందుపరిచిన అనేక షరతులను ఉల్లంఘించినందున ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని మస్క్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నప్పుడు తెలిపారు.

 

మొత్తం వివాదం ఏమిటి
వాస్తవానికి, మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి నిరాకరించిన మస్క్ గత వారం ఒప్పందాన్ని రద్దు చేశాడు. సంవత్సరం ప్రారంభంలో ట్విట్టర్‌ని కొనుగోలు చేయడానికి మస్క్ 44 బిలియన్ల బిడ్‌ను దాఖలు చేశాడు, దీనికి ట్విట్టర్ కంపెనీ బోర్డు ఆమోదం కూడా లభించింది. అయితే, మస్క్ సోషల్ సైట్‌లో నకిలీ ఖాతాలకు సంబంధించిన గణాంకాలను కోరాడు, సరైన సమాచారం రాకపోవడంతో ఒప్పందం రద్దు చేసుకుననాడు. డీల్‌లో పొందుపరిచిన నిబంధనల ప్రకారం, మస్క్ డీల్‌ను రద్దు చేసుకుంటే, అతను భారీ మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ప్రకటించిన తర్వాత, ఇప్పుడు టెస్లా CEO ఎలోన్ మస్క్‌పై దావా వేయనున్నామని. ఒప్పందంలో ఉన్న జరిమానా మొత్తాన్ని డిమాండ్ చేస్తామని ట్విట్టర్ తెలిపింది. ఎలోన్ మస్క్‌కి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయడానికి ట్విట్టర్ న్యూయార్క్‌లోని అతిపెద్ద న్యాయ సంస్థ వాచెల్, లిప్టన్, రోసెన్ & కాట్జ్ LLPని నియమించుకుంది. అయితే మస్క్ మాత్రం ట్విట్టర్ బెదిరింపులను లైట్ తీసుకున్నాడు. ట్విట్టర్ చట్టపరమైన బెదిరింపులను ఎగతాళి చేయడం ప్రారంభించాడు.

Twitter నకిలీ ఖాతాల గణాంకాలను అందించలేకపోయింది
ఒప్పందం ఖరారైన తర్వాత, ఎలోన్ మస్క్ తన సైట్‌లోని బోట్ ఖాతాల గురించి, అంటే నకిలీ ఖాతాల గురించిన సమాచారం కోసం ట్విట్టర్‌ని పదే పదే అడిగాడు. దీనిపై కంపెనీ మాట్లాడుతూ మొత్తం ఖాతాల్లో దాదాపు 5 శాతం బోట్ ఖాతాలేనని తెలిపింది. అయితే, బోట్ ఖాతాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని టెస్లా CEO పదేపదే పేర్కొన్నాడు, దానిని కంపెనీ పదేపదే ఖండించింది. అయినప్పటికీ, Twitter అసలు బోట్ ఖాతాల సంఖ్య గురించి సాక్ష్యాలను సమర్పించలేకపోయింది. వ్యాపార దృక్కోణం నుండి ఈ సమాచారాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అని మస్క్ చాలా సార్లు తెలిపారు. ఈ లోపం వల్లే ఈ డీల్ రద్దయిందని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు