Petrol, diesel prices today:పెట్రోల్ డీజిల్ తాజా ధరలు.. 12సంవత్సరాల తర్వాత ముడి చమురులో అతిపెద్ద పెరుగుదల..

Ashok Kumar   | Asianet News
Published : Dec 31, 2021, 10:32 AM IST
Petrol, diesel prices today:పెట్రోల్ డీజిల్ తాజా ధరలు.. 12సంవత్సరాల తర్వాత ముడి చమురులో అతిపెద్ద పెరుగుదల..

సారాంశం

ఈ ఏడాది చివరి రోజు డిసెంబర్ 31 శుక్రవారం నాడు పెట్రోల్(petrol), డీజిల్(diesel) ధరలలో ఎలాంటి మార్పు లేదు. దీపావళి సందర్భంగా కేంద్రం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపును ప్రకటించింది, ఫలితంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా దిగోచ్చాయి.  

గత 57 రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు, అయితే ఈ సంవత్సరం క్రూడాయిల్ ధర (అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర) బాగా పెరిగింది.  ఒక నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం ముడి చమురు ధర 50 శాతానికి పైగా పెరిగింది. 2009 తర్వాత ఇదే అతిపెద్ద వార్షిక పెరుగుదల. మరోవైపు ముడి చమురు ధర 80 డాలర్లకు చేరువలో ఉంది. ఇంకా రానున్న రోజుల్లో మరింత పెంపు చూడవచ్చు.

పెట్రోల్ ధరలో మార్పు
ఐ‌ఓ‌సి‌ఎల్ సమాచారం ప్రకారం, దేశంలోని నాలుగు మెట్రోలలో పెట్రోల్ ధరలో ఎటువంటి మార్పు లేదు . ఒకరోజు క్రితం అంటే గురువారం ధరలు ఈరోజు కూడా వర్తిస్తుంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41గా ఉంది. మరోవైపు కోల్‌కతా, ముంబై, చెన్నైలలో లీటర్ పెట్రోల్ ధర వరుసగా రూ.104.67, రూ.109.98, రూ.101.40గా ఉంది. ఢిల్లీలో వ్యాట్ తగ్గింపు కారణంగా, పెట్రోల్ ధర లీటరుకు రూ.8.56 తగ్గింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు నవంబర్ 4, 2021 నుండి పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు.

స్థిరంగా డీజిల్ ధరలు 
డీజిల్ ధర గురించి మాట్లాడితే వరుసగా 57వ రోజు స్థిరంగా కనిపించింది . ఐ‌ఓ‌సి‌ఎల్ నుండి అందిన సమాచారం ప్రకారం, దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుంది. లెక్కల ప్రకారం డీజిల్ ధర న్యూఢిల్లీలో రూ.86.67, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, చెన్నైలో లీటరు రూ.91.43గా ఉంది. దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుంచి జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

also read sharemarket outlook 2022:ఓమిక్రాన్ నీడలో స్టాక్ మార్కెట్.. కొత్త సంవత్సరంలో పెట్టుబడిదారులు డబ్బు సంపాదిస్తారా

6.  హైదరాబాద్
పెట్రోల్ - రూ.108.20 లీటర్
డీజిల్ - రూ.94.62

ముడి చమురు ధరలు నేడు శుక్రవారం 1 శాతం పడిపోయాయి, ఇది 2009 నుండి అతిపెద్ద వార్షిక లాభం , ఆ తర్వాత కూడా  గత 12 సంవత్సరాలలో అతిపెద్ద ర్యాలీతో నిలిచింది. 2021 చివరి రోజున బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 53 శాతం లాభపడగా, యుఎస్ క్రూడ్ ఫ్యూచర్స్ 57 శాతం పెరిగాయి. 2009 తర్వాత రెండు బెంచ్‌మార్క్ కాంట్రాక్ట్‌లలో ఇదే అతిపెద్ద పెరుగుదల. 2009లో ముడి చమురు ధర 70 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక శాతం తగ్గి బ్యారెల్‌కు 78.77 డాలర్లు, డబ్ల్యూటీఐ బ్యారెల్ ధర 76.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఈ విధంగా మీ నగరంలో 
 ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతాయి. మీరు పెట్రోల్, డీజిల్ ధరలను ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP స్పేస్ పెట్రోల్ పంప్ కోడ్‌ను 9224992249 నంబర్‌కి, BPCL కస్టమర్‌లు 9223112222 నంబర్‌కి RSP అని టైప్ చేసి సమాచారాన్ని పొందవచ్చు. దీని ద్వారా మీరు మీ నగరంలో పెట్రోల్ ధర గురించి సమాచారాన్ని పొందుతారు.  

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరను బట్టి ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ధరలు నిర్ణయించబడతాయి. ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించిన తర్వాత ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను మారుస్తాయి.
 

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే