
కరోనా (coronavirus) మహమ్మారి కారణంగా ఈ ఏడాది అందరిలో, అన్ని రంగాల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ స్టాక్ మార్కెట్‌లపై మాత్రం అంతగా ప్రభావం పడలేదని చెప్పుకోవచ్చు. 2021 వరకు చూస్తే ఇది ఫైనాన్స్ మార్కెట్‌కు లాభసాటిగానే వుందని చెప్పవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ 2021లో తమ పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించాయి. మరోవైపు, సెన్సెక్స్ 2021లో పెట్టుబడిదారుల సంపదకు రూ.72 లక్షల కోట్లు జోడించింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ ఏడాది తొలిసారిగా 50,000 మార్క్‌ను అధిగమించి చరిత్ర సృష్టించింది. అంతేనా ఈ ఏడాది భారీ ఐపీవోలు సైతం ఇన్వెస్టర్ల ముందుకు వచ్చాయి. దీని కారణంగా పెట్టుబడిదారులు భారీ లాభాలను పొందారు. రెండు రోజుల్లో మనం 2022లోకి ప్రవేశించబోతున్నాము, మరి 2022లో ఎక్కువ డబ్బు సంపాదించడానికి పెట్టుబడిదారులు ఎక్కడ పెట్టుబడి పెట్టవచ్చో.. నిపుణులు ఏమన్నారో ఒకసారి చూస్తే:
క్రిప్టోకరెన్సీ:
ప్రస్తుతం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెట్టుబడి రంగాలలో క్రిప్టోకరెన్సీ (Cryptocurrency) ఒకటి. క్రిప్టో మైనింగ్‌తో పాటు డిజిటల్ కరెన్సీలు అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా నిరూపించబడ్డాయి. క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడి సంప్రదాయ ఆస్తులను అధిగమిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బిట్‌కాయిన్, ఎథెరియం, డాగ్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు ఇటీవలి కాలంలో మంచి రాబడిని ఇచ్చాయని ప్రొఫిషియెంట్ ఈక్విటీస్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ మనోజ్ దాల్మియా చెప్పారు.
స్టాక్ మార్కెట్:
2022 సంవత్సరానికి గాను ఐదు అత్యున్నత స్టాక్‌లలో (Stocks) పెట్టుబడిని నిపుణులు సూచిస్తున్నారు. వాటి నుండి పెట్టుబడిదారులు ప్రయోజనం పొందవచ్చని రీసెర్చ్-షేర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి సింగ్ తెలిపారు. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), GAIL, HDFC బ్యాంక్, TCS మరియు ONGC ఉన్నాయి.
రియల్ ఎస్టేట్:
భవిష్యత్తుకు భరోసానిస్తూ మంచి రాబడిని అందించే పెట్టుబడి ఎంపికలలో రియల్ ఎస్టేట్ (Real estate) ఒకటి. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రొఫిషియెంట్ ఈక్విటీస్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ మనోజ్ దాల్మియా ప్రకారం.. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే REITల కోసం వెతకవచ్చు.
కో వర్కింగ్ స్పేస్:
కోవిడ్ మహమ్మారి వాణిజ్య ఆస్తులను గణనీయంగా ప్రభావితం చేసింది. దీని కారణంగా ఆస్తి రేట్లు ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అవంత ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నకుల్ మాథుర్ ప్రకారం, 2022లో కో-వర్కింగ్ స్పేస్‌లకు (Co-working spaces) డిమాండ్ పెరుగుతుందట. అందువల్ల ఆఫీస్ స్పేస్‌ను కొనుగోలు చేసి.. కో-వర్కింగ్ స్పేస్‌గా మార్చుకోవచ్చు. దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా గరిష్ట లాభం పొందవచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్:
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది సీనియర్ సిటిజన్‌ల కోసం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్. ఇది పెట్టుబడిదారులకు భద్రతతో పాటు సాధారణ ఆదాయాన్ని అందిస్తుంది. ఇది కూడా ఒకరకమైన పన్ను ఆదా పథకం. రిస్క్ లేని పెట్టుబడి మార్గాలను వెతుకుతున్న రిటైర్డ్ ఇన్వెస్టర్లకు ఇది అనుకూలంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడికి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం కింద అందించే ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.4%.
జాతీయ పెన్షన్ పథకం:
ఎన్‌పిఎస్ అనేది రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్. ఇది చందాదారులందరికీ పదవీ విరమణ తర్వాత ఆదాయాన్ని అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ గడిచిన 12 ఏళ్లలో ప్రజలకు మంచి రాబడులను అందించిందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ అన్నారు. మీరు POP (పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్), ఇన్వెస్ట్‌మెంట్ ప్యాటర్న్, ఫండ్ మేనేజర్‌ని ఎంచుకోవడానికి లేదా మార్చడానికి వెసులుబాటు కూడా వుంటుందని షేర్ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి సింగ్ చెప్పారు. ఇది ట్రిపుల్ పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.