ATM card:చనిపోయిన వ్యక్తి ఏ‌టి‌ఎం కార్డు నుండి మర్చిపోయి కూడా డబ్బు తీసుకోకండి, జైలు శిక్ష పడవచ్చు ఎందుకంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Feb 24, 2022, 07:26 PM IST
ATM card:చనిపోయిన వ్యక్తి ఏ‌టి‌ఎం కార్డు నుండి మర్చిపోయి కూడా డబ్బు తీసుకోకండి, జైలు శిక్ష పడవచ్చు ఎందుకంటే ?

సారాంశం

చనిపోయిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయడం శిక్షార్హమైన నేరమని మీకు తెలుసా..? కాబట్టి దీనికి సంబంధించి బ్యాంకు నియమాల గురించి తెలుసుకోండి..

ఏ‌టి‌ఎం కార్డ్ అండ్ పిన్ ఉపయోగించి మరణించిన వారి బ్యాంక్ ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా చేయడం చట్టబద్ధమైనదేనా ? ఒకరు మరణించిన తర్వాత ఎవరైనా బ్యాంకుకు సమాచారం ఇవ్వకుండా ఆ వ్యక్తి  ఖాతా నుండి డబ్బు డ్రా చేస్తే దానికి ఎలాంటి నేరపూరిత శిక్ష విధించబడుతుంది? ఖాతా లేదా చట్టపరమైన వారసులకు సంబంధించి ఏదైనా వివాదం ఉందా ?

నేటి కాలంలో బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు బ్యాంకుకు సంబంధించిన అన్నీ పనులు ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతున్నాయి. ఒకప్పుడు బ్యాంకు పని కోసం ఒక రోజంతా పట్టేది. అలాగే  డబ్బును విత్‌డ్రా చేయడానికి పెద్ద ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. ముందుగా బ్యాంకుకు వెళ్లి, ఒక స్లిప్‌ను నింపి, ఆపై కౌంటర్ వద్ద పొడవైన లైన్‌లో నిలబడి మీ వంతు కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. మీ వంతు వచ్చినప్పుడు స్లిప్‌లో వివరాలు బాగానే ఉంటే, మీకు డబ్బు వస్తుంది. అయితే ఏటీఎం కార్డులు అందుబాటులోకి రావడంతో ప్రజలు ఈ లాంగ్ లైన్ల నుంచి విముక్తి పొందారు. ఇప్పుడు మీకు కావలసినప్పుడు ఏ‌టి‌ఎం నుండి డబ్బు తీసుకోవచ్చు. అయితే చనిపోయిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయడం శిక్షార్హమైన నేరమని మీకు తెలుసా..? కాబట్టి దీనికి సంబంధించి బ్యాంకు నియమాల గురించి తెలుసుకోండి..

శిక్షించబడవచ్చు
ఒక వ్యక్తి చనిపోతే అతని కుటుంబ సభ్యులు అతని ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకోవడం చాలా సార్లు చూస్తుంటాం. కానీ అలా చేయడం చట్టవిరుద్ధం. ముందుగా బ్యాంకుకు ఈ సమాచారం ఇవ్వకుండా చనిపోయిన వ్యక్తికి నామినీ కూడా డబ్బు తీసుకోలేరు. అలాగే ఎవరైనా ఇందులో పట్టుబడితే అతను శిక్షించబడవచ్చు.

నియమం ఏమిటి?
మీరు మరణించిన వ్యక్తి  బ్యాంక్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయవలసి వస్తే దీని కోసం బ్యాంకుకు స్వంత నియమాలు ఉన్నాయి. నిజానికి ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని బ్యాంక్ ఖాతాలోని మొత్తాన్ని మీ పేరు మీద బదిలీ చేసిన తర్వాత మాత్రమే మీరు అతని డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సమాచారాన్ని బ్యాంకుకు ముందుగా అందజేయాల్సి ఉంటుంది.

ఒక నామినీ మరణించిన వ్యక్తి  బ్యాంకు ఖాతా నుండి డబ్బు తీసుకోవచ్చు. మరోవైపు చాలా బ్యాంకు ఖాతాలు కూడా ఒకటి కంటే ఎక్కువ నామినీలను కోరుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నామినీలందరూ బ్యాంకుకు సమ్మతి లేఖను చూపించవలసి ఉంటుంది, ఆ తర్వాత మాత్రమే మీరు మరణించిన వ్యక్తి ఖాతా నుండి డబ్బును తీసుకోవచ్చు.

మీరు ఇలా డబ్బు పొందవచ్చు
మరణించిన వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ చేసిన డబ్బు కోసం నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు. దీని కోసం ఒక ఫారమ్ నింపాల్సి  ఉంటుంది. దానితో పాటు మరణించిన వారి పాస్‌బుక్, ఖాతా టిడిఆర్, చెక్ బుక్, మరణ ధృవీకరణ పత్రం, మీ ఆధార్, పాన్ కార్డ్ ఇవ్వాలి. ఈ ప్రక్రియ తర్వాత మీ ఖాతా డబ్బు  నామినికి ఇవ్వబడుతుంది అలాగే మరణించిన వారి బ్యాంక్ ఖాతా మూసివేయబడుతుంది.

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే