Russia Ukraine war Effect:నేడు సెన్సెక్స్ కి అతిపెద్ద ఎదురుదెబ్బ.. కరోనాకాలం కంటే ఈ ఏడాదిలో భారీ పతనం..

Ashok Kumar   | Asianet News
Published : Feb 24, 2022, 05:18 PM ISTUpdated : Feb 24, 2022, 05:20 PM IST
Russia Ukraine war Effect:నేడు సెన్సెక్స్ కి అతిపెద్ద ఎదురుదెబ్బ.. కరోనాకాలం కంటే ఈ ఏడాదిలో భారీ పతనం..

సారాంశం

 గురువారం స్టాక్ మార్కెట్‌కు బ్యాడ్ డేగా నిరూపించింది. బి‌ఎస్‌ఈ సెన్సెక్స్ ఇప్పటివరకు ఈ సంవత్సరం చూడని అతిపెద్ద పతనాన్ని చూసింది. సెన్సెక్స్ 2014నాటికి పడిపోయింది. కరోనా మహమ్మారి తర్వాత సెన్సెక్స్ భారీ పతనాన్ని చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ నేటి  క్షీణతకు కారణం కరోనా  వ్యాప్తి కాదు, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం.

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా భారత స్టాక్ మార్కెట్ గురువారం దారుణంగా కుప్పకూలింది. దీంతో సెన్సెక్స్ ఈ సంవత్సరం అతిపెద్ద పతనాన్ని చూసింది. మరోవైపు 2014 నాటికి 55 వేల స్థాయికి పడిపోయింది. 2022 సంవత్సరం ప్రారంభం తర్వాత సెన్సెక్స్‌లో  ఇది నాలుగో అతిపెద్ద క్షీణత. ఈ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ నేడు ప్రారంభమైన  కొన్ని నిమిషాల్లో 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడిదారులు మునిగిపోయారు.

కరోనా కాలం నుండి భారీ క్షీణత
2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి స్టాక్ మార్కెట్ చాలాసార్లు కుప్పకూలింది. కరోనా మహమ్మారి సమయంలో సెన్సెక్స్ ఇప్పటివరకు చరిత్రలో అతిపెద్ద పతనాలను చూసింది. వీటిలో అతిపెద్ద పతనం 23 మార్చి 2020న సెన్సెక్స్ 3934 పాయింట్లను బ్రేక్ చేసింది. దీని తరువాత సెన్సెక్స్ పెట్టుబడిదారులకు భారీ నష్టాలను కలిగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ట్రెండ్ 2022లో కూడా కనిపిస్తుంది. కేవలం ఒకటిన్నర నెలల్లోనే సెన్సెక్స్ చాలాసార్లు  పడిపోయింది. 


సెన్సెక్స్ బ్యాడ్ ఫేజ్
తేదీ             సంవత్సరం    పతనం
12మార్చి      2020               2919
16 మార్చి      2020              2713
23 మార్చి      2020              3934
04 మే           2020              2002
18  మే          2020              1068
26 ఫిబ్రవరి   2021               1939
12 ఏప్రిల్     2021               1707
26 నవంబర్   2021             1687
24 జనవరి     2022              1546
07 ఫిబ్రవరి    2022              1024
24ఫిబ్రవరి     2022               2014 

స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు 
గురువారం భారత స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే రష్యా, ఉక్రెయిన్ మధ్య మొదలైన ఉద్రిక్తతలు భారీ పతనానికి ప్రధాన కారణం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక చర్యను ప్రకటించిన కొద్దిసేపటికే, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీ క్షీణతను నమోదు చేశాయి. ఈ క్షీణతకు మూడు ప్రధాన కారణాలు క్రింది విధంగా ఉన్నాయి. 

స్టాక్ మార్కెట్‌  కుప్పకూలడానికి అత్యంత బాధ్యత వహించే మొదటి కారణం
రష్యా  ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య  రష్యా అధ్యక్షుడు  పుతిన్  చేసిన ఆదేశం తర్వాత పెట్టుబడిదారుల సెంటిమెంట్లు దెబ్బతింది  దీంతో షేర్ మార్కెట్లు వెంటనే కుప్పకూలాయి. వార్తల ప్రకారం, తూర్పు ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక కార్యకలాపాలను ప్రారంభించినట్లు ప్రకటించిన తర్వాత రష్యా దళాలు కొన్ని ఉక్రేనియన్ నగరాలపై బాంబు దాడి తెగబడ్డాయి. రష్యా చర్య బహుశా పెట్టుబడిదారుల ఆలోచన నుండి చెత్త పరిణామం.

రెండవ కారణం
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా 2014 తర్వాత తొలిసారిగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా పెరిగాయి, దీని వల్ల కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. రష్యా  అధ్యక్షుడు పుతిన్ చేసిన యుద్ధ ప్రకటన ఇంధన ఎగుమతులలో అంతరాయం కలిగించే భయాన్ని పెంచింది. రష్యా ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారి, రష్యా ప్రధానంగా యూరోపియన్ రిఫైనరీలకు ముడి చమురును విక్రయిస్తుంది. ఐరోపా దేశాలు తమ చమురులో 20 శాతానికి పైగా రష్యా నుంచి తీసుకుంటున్నాయి.  

మూడవ కారణం
మూడవ కారణం  ఏంటంటే ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్ గడువు గురువారంతో ముగుస్తుంది. స్టాక్ మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్‌లో ఇండియా VIX 22.39 శాతం పెరిగి 30.16కి చేరుకుంది. ప్రతికూల స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ మధ్య మిడ్‌క్యాప్ అండ్ స్మాల్‌క్యాప్ స్టాక్‌లు భారీ నష్టాన్ని చవిచూశాయి. నేటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 576 పాయింట్లు, 804 పాయింట్లు నష్టపోయాయి.
 

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే