రూ. లక్ష కోట్లకు చేరిన జన్‌ధన్ ఖాతాల డిపాజిట్లు!

By rajashekhar garrepallyFirst Published Apr 22, 2019, 10:14 AM IST
Highlights

నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కిందట ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్‌ధన్ ఖాతాలు రికార్డు స్థాయిలో డిపాజిట్లను నమోదు చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ ఖాతాల్లో ఉన్న మొత్తం సొమ్ము సుమారు లక్ష కోట్ల రూపాయలకు చేరువలో ఉండటం గమనార్హం. 

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కిందట ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్‌ధన్ ఖాతాలు రికార్డు స్థాయిలో డిపాజిట్లను నమోదు చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ ఖాతాల్లో ఉన్న మొత్తం సొమ్ము సుమారు లక్ష కోట్ల రూపాయలకు చేరువలో ఉండటం గమనార్హం. 

జన్ ఖాతాలు పెరుగుతున్నాయని, అలాగే వాటిలో నగదు డిపాజిట్లు కూడా అంతఅంతకు పెరుగుతున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. 
ఏప్రిల్ 3వ తేదీ వరకు రూ. 97,665.66కోట్లు జన్‌ధన్ ఖాతాల్లో ఉన్నట్లు వారు తెలిపారు.

అదే సమయంలో జన్‌ధన్‌ ఖాతాలు సంఖ్య కూడా 35.39కోట్లకు చేరింది.  జన్‌ధన్ ఖాతాల్లో నగదు మార్చి 27 నాటికి 96,107కోట్లు ఉండగా, అంతకుముందు వారం రూ. 95,382.14కోట్లు మాత్రమే ఉంది. కాగా, మొత్తం 27.89కోట్ల మందికి రూపే కార్డులను జారీ చేసినట్లు వివరించారు.

2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.  2018, ఆగస్టు 28 తర్వాత ఈ ఖాతాలను ప్రారంభించిన వారికి ప్రమాద బీమాను రూ. లక్ష నుంచి రూ. 2లక్షలకు పెంచారు. 

కాగా, ఈ బ్యాంకు ఖాతాల్లో 50శాతం మహిళలే కావడం గమనార్హం. మొత్తం ఖాతాల్లో 59శాతం ఖాతాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. పేదలకు బ్యాంకు సేవలు అందించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చే  ఉద్దేశంతో ఈ జన్‌ధన్ పథకాన్ని ప్రవేశపెట్టారు.

 

చదవండి: ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి పాలసీ: తెలుసుకోవాల్సిన విషయాలు

click me!