ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి పాలసీ: తెలుసుకోవాల్సిన విషయాలు

By rajashekhar garrepallyFirst Published Apr 20, 2019, 3:05 PM IST
Highlights

భారత అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) నాలుగు రకాల పెన్షన్ ప్లాన్స్ అందిస్తోంది. ‌వాటిలో  ప్రధానమంత్రి వయా వందన యోజన, ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి, ఎల్ఐసీ జీవన్ అక్షయ్-VI, ఎల్ఐసీ జీవన్ శాంతి పాలసీ ఉన్నాయి.

భారత అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) నాలుగు రకాల పెన్షన్ ప్లాన్స్ అందిస్తోంది. ‌www.licindia.in. వెబ్‌సైట్‌లో పేర్కొనబడిన వివరాల ప్రకారం.. వాటిలో  ప్రధానమంత్రి వయా వందన యోజన, ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి, ఎల్ఐసీ జీవన్ అక్షయ్-VI, ఎల్ఐసీ జీవన్ శాంతి పాలసీ ఉన్నాయి.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ కొత్త(న్యూ) జీవన్ నిధితో రెండు రకాల లాభాలున్నాయి. అవే రక్షణ, పొదుపు. 

ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి ప్లాన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు: 

- 20-60ఏళ్ల మధ్య వయస్కులు ఎవరైనా ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి ప్లాన్(పెన్షన్ ప్లాన్)ను కొనుగోలు చేయవచ్చు. రెగ్యూలర్ ప్రీమియమ్ పాలసీ ఆప్షన్ కింద రూ.1లక్ష కనీస ప్రాథమిక మొత్తాన్ని హామీగా ఉంచాలి. సింగిల్ ప్రీమియమ్ పాలసీ ఆప్షన్ కింద రూ.1.5లక్షలు ఉంచాలి.

- సింగిల్ ప్రీమియమ్ ఆప్షన్ కింద ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి ప్లాన్ కొనుగోలు చేసేవారు ఐదేళ్ల నుంచి 35ఏళ్లలో కాలాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. రెగ్యూలర్ ప్లాన్ ఆప్షన్‌లో అయితే ఏడేళ్ల నుంచి 35ఏళ్ల మధ్య కాలాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

-ఎల్ఐసీ ప్రకారం కనీసం 55ఏళ్ల నుంచి పెన్షన్ ప్రారంభం అవుతుంది. గరిష్టంగా 65ఏళ్ల వరకు పరిమితి ఉంది.

- పాలసీ నిబంధనల ప్రకారం.. ప్రీమియమ్‌ మొత్తాన్ని ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు లేదా నెలవారీగా క్రమం తప్పకుండా చెల్లించాలి. అలాగే ప్రత్యామ్నాయంగా సింగిల్ ప్రీమియమ్ కూడా చెల్లించాలి. 

- ఒకవేళ గ్రేస్ పీరియడ్‌లో ప్రీమియమ్స్ చెల్లించకపోతే పాలసీ కోల్పోవాల్సి వస్తుంది.
- కోల్పోయిన పాలసీని తిరిగి కొనసాగించాలంటే.. చెల్లింపును నిలిపేసిన తేదీ నుంచి రెండేళ్లలోపే ప్రీమియమ్ చెల్లింపులను ప్రారంభించాల్సి ఉంటుంది. ఏరియర్స్, వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
- పాలసీ గడువులో ముగియకముందే వ్యక్తి చనిపోతే ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి కవర్ చేస్తోంది. లేదంటే వార్షిక మొత్తాలను అందజేస్తుంది. 

చదవండి: ఎస్బీఐ ఏటీఎం కార్డ్ విత్‌డ్రా లిమిట్, ఛార్జీలు మీకు తెలుసా?

click me!