కరోనాపై పోరు: ఉద్యోగులకు కాగ్నిజెంట్ బంపర్ ఆఫర్

By Siva KodatiFirst Published Mar 27, 2020, 3:01 PM IST
Highlights

కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రముఖ కార్పోరేట్ దిగ్గజం, టెక్ సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఉన్న అసోసియేట్ స్థాయి వరకు వున్న ఉద్యోగులకు ఏప్రిల్ నెల మూలవేతనంలో 25 శాతం అదనంగా చెల్లించనుంది. 

కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రముఖ కార్పోరేట్ దిగ్గజం, టెక్ సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఉన్న అసోసియేట్ స్థాయి వరకు వున్న ఉద్యోగులకు ఏప్రిల్ నెల మూలవేతనంలో 25 శాతం అదనంగా చెల్లించనుంది.

కాగ్నిజెంట్ నిర్ణయం కారణంగా భారతదేశంలో ఉన్న మూడింట రెండు వంతుల మంది ఉద్యోగులకు మేలు కలగనుంది. ఈ విధానాన్ని నెలవారీగా సమీక్షిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read:యెస్ బ్యాంక్ సీఈఓగా ప్రశాంత్ : రూ.5000 కోట్ల పెట్టుబడుల సేకరణకు నిర్ణయం

సిబ్బంది ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని సురక్షితమైన సేవలను కొనసాగిస్తామని కాగ్నిజెంట్ వెల్లడించింది. అంతేకాకుండా ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఇంటి నుంచే పనిచేసేందుకు అవకాశం కల్పించింది.

దీనితో పాటు వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు కావల్సిన కొత్త ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ ఎన్ క్రిప్టింగ్, అదనపు బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీ, ఎయిర్‌కార్డులను అందించడం వంటి సదుపాయాలను కల్పించింది.

Also Read:లాక్‌డౌన్‌కు మద్దతు:మోదీ పిలుపుకు కార్పొరేట్ల మద్దతు

అన్ని అంతర్జాతీయ కంపెనీల మాదిరిగానే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రభావానికి తాము కూడా గురవుతున్నట్లు కాగ్నిజెంట్ చెప్పింది. ఈ క్లిష్ట సమయంలో మనమందరం ప్రతిరోజూ కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నామని అయినప్పటికీ ధైర్యంతో ముందుగా సాగుదామని కంపెనీ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఇలాంటి పరిస్ధితుల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంక్షోభ సమయంలో విశేష సేవలు అందిస్తున్న కీలక వ్యక్తులకు బహుమతి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని బ్రియాన్ తెలిపారు. 
 

click me!