యెస్ బ్యాంక్ సీఈఓగా ప్రశాంత్ : రూ.5000 కోట్ల పెట్టుబడుల సేకరణకు నిర్ణయం

By narsimha lodeFirst Published Mar 27, 2020, 2:54 PM IST
Highlights

సంక్షోభంలో ఉన్న యెస్​ బ్యాంకు కొత్తగా రూ.5 వేల కోట్ల నిధులు సమీకరించేందుకు ఆ సంస్థ బోర్డు పచ్చజెండా ఊపింది. మారటోరియం ఎత్తేసిన తర్వాత జరిగిన బోర్డు సమావేశంలో అర్హత కలిగిన సంస్థలు, హక్కులు, షేర్లు కొనుగోలు ద్వారా నిధుల సేకరణకు అంగీకారం తెలిపింది.
 

ముంబై: సంక్షోభంలో ఉన్న యెస్​ బ్యాంకు కొత్తగా రూ.5 వేల కోట్ల నిధులు సమీకరించేందుకు ఆ సంస్థ బోర్డు పచ్చజెండా ఊపింది. మారటోరియం ఎత్తేసిన తర్వాత జరిగిన బోర్డు సమావేశంలో అర్హత కలిగిన సంస్థలు, హక్కులు, షేర్లు కొనుగోలు ద్వారా నిధుల సేకరణకు అంగీకారం తెలిపింది.

రూ.5 వేల కోట్లు సమీకరణకు ఎస్​ బ్యాంకు బోర్డు ఆమోదం
ముంబై: అర్హత కల సంస్థలు, హక్కులు, షేర్ల కొనుగోలుతో రూ.5,000 కోట్ల నిధుల సమీకరించాలన్న నిర్ణయానికి యెస్ బ్యాంకు బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఇదే సమావేశంలో బ్యాంకు ఎండీ, సీఈఓగా ప్రశాంత్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

అర్హత కలిగిన సంస్థలే కాకుండా భద్రతపరమైన హామీ మార్గాలు, హక్కులు, అంతర్జాతీయ డిపాజిటరీ రశీదులు, అమెరికన్ డిపాజిటరీ రశీదులు, విదేశీ కరెన్సీ మారకం బాండ్లు లేదా ఏదైనా ఆమోదించదగిన మార్గంలో ఈ నిధులను సేకరించనున్నట్లు బోర్డు తెలిపింది.

అయితే నిధుల సేకరణ రూ.15 వేల కోట్లకు మించకూడదు. ఇప్పటికే 2020 ఫిబ్రవరి ఏడో తేదీన రూ.10 వేల కోట్ల నిధుల సేకరణకు బోర్డు ఆమోదం తెలపగా.. ప్రస్తుతం మరో రూ.5 వేల కోట్లకు అంగీకారం లభించింది.

దేశంలో నాలుగో అతిపెద్ద ప్రైవేట్ రుణదాతగా ఉన్న యెస్​ బ్యాంకులో సంక్షోభం నివారణకు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) చర్యలు చేపట్టింది. మారటోరియం విధించి బ్యాంకు యాజమాన్యాన్ని మార్చింది. యెస్​ బ్యాంకు పునరుద్ధరణ పథకం ఆమోదించిన తర్వాత మారటోరియాన్ని ఆర్​బీఐ ఎత్తివేసింది.

Also read:విలీనం ఏప్రిల్ 1నుంచే.. కరోనాతో బ్యాంకులకు మొండి బాకీల ముప్పు

ఈ స్కీమ్ ప్రకారం యెస్​ బ్యాంకులో 49 శాతం వాటాలను కొనుగోలు చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఎస్బీఐతో కలిసి కొన్ని ప్రైవేట్​ బ్యాంకులు యెస్​ బ్యాంకులో రూ.10 వేల కోట్లు చొప్పించాలని నిర్ణయించాయి. 

ఇందులో ఎస్బీఐ వాటా రూ.6,050 కోట్లు. ప్రైవేట్ రుణదాతల్లో ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్​, ఐడీఎఫ్​సీ, బంధన్, ఫెడరల్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులు రూ.3 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు.

click me!