మార్కెట్లకు సోకిన కరోనా: 5 నిమిషాల్లో.. 5 లక్షల కోట్లు హాంఫట్, ఇలాగే కొనసాగితే

By Siva KodatiFirst Published Feb 28, 2020, 3:40 PM IST
Highlights

శుక్రవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ పతనం నమోదైంది. ఆరంభం నష్టాల నుంచి ఏ మాత్రం కోలుకోకపోవడంతో కీలక సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్ 1300 కుదేలై ప్రస్తుతం 39 వేల దిగువకు చేరి 38,545 పాయింట్ల వద్ద, నిఫ్టీ 356 పాయింట్లు క్షీణించి 11,276 వద్ద కొనసాగుతోంది. తద్వారా 11,300 దిగువకు చేరింది

కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రస్తుతం దీని పేరు వింటేనే ప్రపంచం గడగడలాడిపోతోంది. మనుషుల ప్రాణాలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్థలను ప్రమాదంలోకి నెట్టింది కరోనా వైరస్.

దీని కారణంగా ఎన్నో వాణిజ్య లావాదేవీలు నిలిచిపోవడంతో పాటు ఎగుమతులు, దిగుమతులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా భయంతో భారతీయ మార్కెట్లు సైతం గతకొద్దిరోజులుగా నష్టాలను చవిచూస్తున్నాయి.

శుక్రవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ పతనం నమోదైంది. ఆరంభం నష్టాల నుంచి ఏ మాత్రం కోలుకోకపోవడంతో కీలక సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్ 1300 కుదేలై ప్రస్తుతం 39 వేల దిగువకు చేరి 38,545 పాయింట్ల వద్ద, నిఫ్టీ 356 పాయింట్లు క్షీణించి 11,276 వద్ద కొనసాగుతోంది. తద్వారా 11,300 దిగువకు చేరింది.

Also Read:కరోనాతో ఎకానమీకి కష్టమే:డీఅండ్‌బీ.. తొలిసారి ‘నిర్మల’మ్మ పెదవిరుపు

అన్ని రంగాల్లోనూ అమ్మకాలు భారీగా కొనసాగుతున్నాయి. అత్యథికంగా మెటల్ షేర్లు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ సైతం 2.50 శాతం నష్టంతో 25 వేల దిగువకు చేరింది. దీంతో 5 నిమిషాల్లోనే సుమారు రూ.4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద, రూ.5 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది.

మొత్తం మార్కెట్ క్యాప్ విలువ రూ.150 లక్షల కోట్లకు పడిపోయింది. మొత్తంగా ఆరు రోజుల నుంచి కొనసాగుతున్న వరుస నష్టాలతో దలాల్ స్ట్రీట్‌లో రూ.10 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలపై పెను ప్రభాం చూపుతున్న కరోనాను అదుపు చేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని నష్టాలు ఉంటాయని గ్లోబల్ ఈక్విటీ రీసెర్చ్ సంస్ జెఫెరీస్ విశ్లేషణలో తేలింది.

Also Read:కరోనాను నిరోధించకుంటే.. గ్లోబల్ రిసెషనే.. మూడీస్ వార్నింగ్

ముఖ్యంగా దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లో ఈ వైరస్ విస్తరించడం రానున్న ప్రమాదాన్ని సూచిస్తోందని సంస్థ పేర్కొంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా పతనమవుతూనే ఉంది. గురువారం నాటి ముగింపు 71.55తో పోలీస్తే 38 పైసలు బలహీనపడి 71.93 వద్ద నమోదైంది. 

click me!