మీడియా టెక్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం... ఇండియా గ్లోబల్ ఫోరమ్ సదస్సులో ప్రముఖుల మాట ఇదే

By Siva KodatiFirst Published Dec 14, 2022, 8:27 PM IST
Highlights

యూఏఈలో జరుగుతున్న ఇండియా గ్లోబల్ ఫోరమ్ సదస్సులో జరిగిన సెషన్‌లో మీడియా టెక్‌‌పై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ డిబేట్‌లో వెర్సే ఇన్నోవేషన్ సహ వ్యవస్థాపకుడు ఉమాంగ్ బేడీ, ఆడాసిటీ వెంచర్ క్యాపిటల్ ఫౌండర్, మేనేజింగ్ పార్ట్‌నర్ కబీర్ కొచ్చర్ తదితరులు పాల్గొన్నారు. 
 

మీడియా, వినోదం, కంటెంట్ రంగాలు నిరంతరాయంగా అభివృద్ధి చెందుతున్నాయి. యూఏఈలో జరుగుతున్న ఇండియా గ్లోబల్ ఫోరమ్ సదస్సులో జరిగిన సెషన్‌లో వెర్సే ఇన్నోవేషన్ సహ వ్యవస్థాపకుడు ఉమాంగ్ బేడీ, ఆడాసిటీ వెంచర్ క్యాపిటల్ ఫౌండర్, మేనేజింగ్ పార్ట్‌నర్ కబీర్ కొచ్చర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుతున్న కంటెంట్, సమాచారాన్ని సేకరించే మాధ్యమాలు, సాంప్రదాయాలకు అంతరాయం కలిగించే ధోరుణులపై చర్చా కార్యక్రమం జరిగింది. మీడియా సాంకేతికత భవిష్యత్తును రూపొందించడానికి ఉద్దేశించిన సమాచార పంపిణీ, ప్రేక్షకుల ప్రాధాన్యతలపై వీరు చర్చించారు. 

ఉమాంగ్ బేడీ మాట్లాడుతూ.. భారతీయులు వినియోగించగలిగే లోకల్ కంటెంట్ ప్రాముఖ్యతను వివరించారు. టిక్ టాక్ ఫేస్‌బుక్‌కు గట్టి పోటీగా వుండటానికి గల కారణాలను ఉమాంగ్ వెల్లడించారు. దీనిని కంటెంట్ గ్రాఫ్‌గా నిర్మించారు కానీ సోషల్ గ్రాఫ్‌లో కాదని ఆయన పేర్కొన్నారు. మీడియా టెక్‌లోని ట్రెండ్‌ల విస్తరణను నిర్వచించమని వ్యాఖ్యాత కోరగా.. కబీర్ కొచ్చర్ భారత్‌లో ఆర్ధిక వ్యవస్ధ, గేమింగ్, కంటెంట్ మానిటైజేషన్ గురించి వివరించారు. 

కొత్తగా అభివృద్ధి చెందుతున్న మీడియా కంపెనీలు , కమ్యూనికేషన్, కంటెంట్ వినియోగానికి సంబంధించిన మోడ్‌ల గురించి కూడా ఆయన మాట్లాడారు. ప్రజలు దాని ఆధారంగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఉదాహరణకు 5జీ, మెటావర్స్‌లు .. వ్యక్తులు తమలో తాము ఉత్తమంగా జీవించడానికి వీలు కల్పిస్తుంది. గేమింగ్ అనేది ఆ మెటావర్స్‌కి గేట్‌వే. 

సాంప్రదాయ వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లకు.. మీడియా టెక్ అంటే ఏమిటి అనేదానిపై ప్రేక్షకుల నుంచి వ్యాఖ్యాత ప్రశ్నలు అడిగించారు. దీనికి ఉమాంగ్ బేడీ స్పందిస్తూ.. కనీసం ఇండియాలోనైనా టెలివిజన్ చనిపోలేదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో టెలివిజన్ ఎల్లప్పుడూ ఒక ఆకాంక్షగా వుంటుందని ఉమాంగ్ అన్నారు. కానీ ప్రసార విధానం పూర్తిగా దెబ్బతింటుందని మాత్రం ఆయన అభిప్రాయపడ్డారు. దీనిని మనం ఇప్పటికే చూస్తున్నామని... కానీ ప్రింట్ మీడియాపై ఉమాంగ్ అంత ఆసక్తి చూపడం లేదు. 
 

click me!