700 టన్నుల వ్యర్ధాలు..12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి...

By Sandra Ashok KumarFirst Published Jun 24, 2020, 5:03 PM IST
Highlights

ఈ ప్లాంట్‌ను ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ భగల్ ప్రారంభించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయ్‌పూర్ నగర మేయర్ శ్రీ అజాజ్ ధీబార్, మున్సిపల్ కమిషనర్ శ్రీ సౌరభ్ కుమార్ పాల్గొన్నారు. రాయ్‌పూర్ మున్సిపల్ కార్పోరేషన్, ఢిల్లీ ఎంఎస్‌డబ్ల్యు సొల్యూషన్ లిమిటెడ్ (రామ్కీ కంపెనీ) నడుమ 15 సంవత్సరాల ఒప్పందంలో భాగంగా రాయ్‌పూర్ నగర ఉత్తరాన ఉన్న సక్రీ వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటుచేశారు. 

హైదరాబాద్, 24 జూన్ 2020:   భారతదేశంతో పాటుగా ఆసియాలో సమగ్రమైన పర్యావరణ నిర్వహణ సేవలను అందించడంలో అగ్రగామి సంస్థ రామ్కీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ (రీల్) నేడు ఛత్తీస్‌ఘడ్‌లో అతిపెద్ద ఘన వ్యర్థ నిర్వహణ కర్మాగారాన్ని రోజుకు 700 టన్నుల వ్యర్థాలను నిర్వహించే సామర్థ్యంతో రాయ్‌పూర్‌లో ప్రారంభించింది.

4ఈ ప్లాంట్‌ను ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ భగల్ ప్రారంభించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయ్‌పూర్ నగర మేయర్ శ్రీ అజాజ్ ధీబార్, మున్సిపల్ కమిషనర్ శ్రీ సౌరభ్ కుమార్ పాల్గొన్నారు.

రాయ్‌పూర్ మున్సిపల్ కార్పోరేషన్, ఢిల్లీ ఎంఎస్‌డబ్ల్యు సొల్యూషన్ లిమిటెడ్ (రామ్కీ కంపెనీ) నడుమ 15 సంవత్సరాల ఒప్పందంలో భాగంగా రాయ్‌పూర్ నగర ఉత్తరాన ఉన్న సక్రీ వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటుచేశారు. ఈ కంపెనీ ఇప్పటికే పీపీపీ నమూనాలో ప్రాసెసింగ్ ప్లాంట్, శాస్త్రీయ ల్యాండ్‌ఫిల్‌ను నిర్వహిస్తుంది.

ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 197 కోట్ల రూపాయలు కాగా, 127 కోట్ల రూపాయలను ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి వినియోగించారు. ఈ నూతన వెంచర్ ప్రారంభం సందర్భంగా శ్రీ మసూద్ మల్లిక్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ -రీల్ మాట్లాడుతూ "రాయ్‌పూర్‌లో రామ్కీ యొక్క మొట్టమొదటి భారీ ప్లాంట్‌ను ప్రారంభిస్తుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం.

రోజుకు 700 -1000 టన్నుల వ్యర్థాలను నిర్వహించగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ఈ ప్లాంట్ ప్రారంభంలో మాకు తోడ్పాటునందించిన ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ భూపేష్ భగల్‌తో పాటుగా రాయ్‌పూర్ మున్సిపల్ కార్పోరేషన్‌కు ధన్యవాదములు తెలుపుతున్నాము. రాష్ట్రంలో వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే మొట్టమొదటి కర్మాగారంగా ఇది నిలువనుంది'' అని అన్నారు
రాయ్‌పూర్ మేయర్ అజాజ్ ధీబార్ మాట్లాడుతూ "కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న వేళ, ప్రతి రోజూ మానవ ఆరోగ్యం, ఆర్థికంపై చూపుతున్న ప్రభావం పెరుగుతూనే ఉంది. రామ్కీ ఎన్విరో లాంటి కంపెనీలు గరిష్ట పరిశుభ్రతకు భరోసానూ అందిస్తాయి.

గత కొన్నేళ్లగా రామ్కీతో మేము పనిచేస్తున్నాం. వారి సేవల పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు మరోమారు వారితో విజయవంతమైన భాగస్వామ్యం కోసం ఆసక్తిగా చూస్తున్నాం..'' అని అన్నారు.


ఒప్పందంలో భాగంగా మొత్తం 70 వార్డులలోనూ ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను రామ్కీ సేకరించాల్సి ఉంటుంది. దీనికోసం 220 టాటా ఏస్ వాహనాలు, 29 పోర్టబల్ కంపాక్టర్లు, 6 హుక్ లిఫ్టర్లు, 4 రిఫ్యూజ్ కంపాక్టర్లు, 6 టిప్పర్లు, 2జెసీబీలు వినియోగించనున్నారు.

click me!