బ్యాంక్ కస్టమర్లపై మళ్ళీ చార్జీల మోత..జూలై 1 నుంచి కొత్త రూల్స్..!

By Sandra Ashok KumarFirst Published Jun 24, 2020, 4:15 PM IST
Highlights

 బ్యాంక్ ఖాతాలు ఉన్న‌వారందరికీ జులై నుంచి బ్యాంక్‌కు సంబంధించిన పలు అంశాల్లో కొత్త మార్పులు రాబోతున్నాయి. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ దగ్గరి నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ వరకు పలు అంశాల్లో తీవ్రమైన మార్పులు సంభ‌వించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో బ్యాంక్ కస్టమర్లపైనే నేరుగా ప్రభావం ప‌డ‌నుంది. 

కరోనా వైరస్ దేశవ్యాప్త లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలోని కస్టమర్లకు మినహాయింపులు ఇచ్చింది. వివిధ కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు కాస్త ఊరట కలిగించింది. సుమారు 82 రోజుల లాక్ డౌన్ తరువాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రి బ్యాంకు కస్టమర్లకు చురకలు పెట్టనుంది.

బ్యాంక్ ఖాతాలు ఉన్న‌వారందరికీ జులై నుంచి బ్యాంక్‌కు సంబంధించిన పలు అంశాల్లో కొత్త మార్పులు రాబోతున్నాయి. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ దగ్గరి నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ వరకు పలు అంశాల్లో తీవ్రమైన మార్పులు సంభ‌వించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో బ్యాంక్ కస్టమర్లపైనే నేరుగా ప్రభావం ప‌డ‌నుంది. 

లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో మహిళల ఖాతాలోకి డబ్బులు జమ చేయడం, రేషన్ సరుకులను అదనంగా ఇవ్వడం ఇంకా ఈ‌ఎం‌ఐ మారటోరియం 3 నెలల పాటు వాయిదా వేయడం వంటివి కల్పించిన తరువాత ఇప్పుడు ఆర్ధిక రంగంలో కీలకమైన బ్యాంకింగ్ రంగంలో కొత్తగా మార్పులు తీసుకురానుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాల‌పై వడ్డీ రేట్లను 0.5 శాతం తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమలులోకి వస్తున్నట్లు తెలి‌పింది. దీంతో వచ్చే నెల నుంచి ఆ బ్యాంక్ ఖాతాదారులకు గరిష్టంగా 3.25 శాతం వరకు ఇంట్రస్ట్ లభిస్తుంది.

also read చరిత్రలో ఫస్ట్ టైం.. పెట్రోల్ కంటే డీజిల్ ధరలు హాట్ హాట్ ..

కరోనా వైరస్ వ్యాప్తి నేప‌థ్యంలో విధించిన‌ లాక్ డౌన్ వల్ల ఏటీఎం క్యాష్ విత్‌డ్రాపై చార్జీలు తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విష‌యం మీకు  తెలిసిందే. అయితే వచ్చే జులై నుంచి ఈ సౌల‌భ్యం అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విత్‌డ్రాపై సౌల‌భ్యం 3 నెలలు వరకు మాత్రమే చార్జీల మినహాయింపు ఉంటుంద‌ని తెలిపిన నేప‌థ్యంలో ఇవి మళ్లీ వచ్చే నెల నుంచి అమలులోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇక‌ బ్యాంకు క‌స్ట‌మ‌ర్లకు వచ్చే నెల నుంచి మరో షాక్ కూడా తగలనుంది. నిర్మలా సీతారామన్ గతంలో బ్యాంక్ అకౌంట్ల‌పై మినిమమ్ బ్యాలెన్స్ చార్జ‌స్ కూడా తొల‌గిస్తున్న‌ట్లు ప్రకటించారు. అయితే ఈ బెనిఫిట్ కూడా 3 నెలల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్ల‌డించారు.

దీంతో జులై నుంచి మళ్లీ మినిమమ్ బ్యాలెన్స్ నిబంధ‌న‌లు అమలులోకి రానున్నాయి. దీంతో మళ్లీ ఏ‌టి‌ఎం చార్జీలు బాదుడు మొదలవుతుంది. ఇంకా మిగతా బ్యాంకులలో కూడా ఎలాంటి కొత్త మార్పులు కేంద్రం తీసుకురానుందో వేచి చూడాలి.

click me!