చరిత్రలో ఫస్ట్ టైం.. పెట్రోల్ కంటే డీజిల్ ధరలు హాట్ హాట్ ..

By Sandra Ashok KumarFirst Published Jun 24, 2020, 1:46 PM IST
Highlights

సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లోగానీ, దేశీయ విపణిలో గానీ పెట్రోల్ ధరే ఎక్కువగా ఉంటుంది. కానీ డీజిల్ మీద ఢిల్లీ సర్కార్ వ్యాట్ పెంచేయడంతో దేశ రాజధాని నగరంలో పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉంది. ఈ నెల 7 నుంచి ప్రతి రోజూ వరుసగా కేంద్ర చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ‘హస్తిన’ నగరంలో పెట్రోల్ కంటే డీజిల్ ధరే ఎక్కువ పలుకుతున్నది. ఈ నెల ఏడో తేదీ నుంచి వరుసగా 18వ రోజు దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దీంతో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దాదాపు ఒకే ధర పలుకుతున్నాయి.

అక్కడ లీటర్‌ డీజిల్‌ ధర రూ.79.88 కాగా, పెట్రోల్‌ ధర రూ. 79.76 ఉంది. అంటే ఒక్క రోజులో లీటర్‌ డీజిల్‌పై ధర 48 పైసలు పెరిగింది. 18 రోజుల వ్యవధిలో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 9.41, డీజిల్‌ రూ. 9.58 పెరిగాయి. 

ఇంటర్నేషనల్‌‌ బెంచ్‌‌మార్క్ రేట్ల ప్రకారం ఎక్కడైనా పెట్రోల్‌‌ ధర డీజిల్‌‌ కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఢిల్లీ ప్రభుత్వం డీజిల్‌‌పై వ్యాట్‌‌ను భారీగా పెంచడంతో దేశ రాజధానిలో పెట్రోల్‌ కంటే డీజిల్‌ ఖరీదుగా మారింది. అయినా ఇతర మెట్రో నగరాలైన కోల్‌కతా, ముంబై, చెన్నై నగరాల్లో డీజిల్‌ రేట్ల కంటే పెట్రోల్‌ ధరలు అధికంగా ఉన్నాయి.

also read కరోనా కాలంలో కాసుల వర్షం: 4 నెలల్లో 25% పెరిగిన అతని సంపద!

ఢిల్లీ ప్రభుత్వం డీజిల్ మీద వ్యాట్ రూ.16.75 అంటే 30 శాతం, పెట్రో్ల్ మీద 27 శాతం నుంచి 30 శాతానికి పెంచింది. దీంతో డీజిల్ లీటర్ ధర రిటైల్ మార్కెట్‪లో 7.10, పెట్రోల్ లీటర్ ధర రూ.1.67 పెరుగుతున్నది. ప్రస్తుతం పెట్రోల్ మీద లీటర్‌కు రూ.32.98, డీజిల్ మీద రూ.31.83 ఎక్సైజ్ సుంకం అమలులో ఉంది. ఢిల్లీలో వ్యాట్ లీటర్ పెట్రోల్ మీద రూ.17.71, డీజిల్ మీద రూ.17.60 వసూలు చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు రవాణా, పారిశ్రామిక కార్యకలాపాలపై పరిమితులను సడలించడంతో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జూన్‌ ఏడవ తేదీకి ముందు లాక్‌డౌన్‌ కారణంగా 82 రోజులు దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. 

అసలు విషయమేమిటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రకారం పెట్రోల్ కంటే డీజిల్ ధరే ఎక్కువ. ఈ నెల 16 నుంచి డీజిల్ ధర రూ.22.93కు పెరిగితే, పెట్రోల్ మీద రూ.22.11 పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్ను వల్ల డీజిల్ ధర కంటే పెట్రోల్ దర ఎక్కువగా ఉంది. డీజిల్ కంటే పెట్రోల్ ధర లీటర్ మీద ముంబైలో రూ.8, చెన్నై-కోల్ కతాల్లో రూ.6 ఎక్కువగా ఉంది. 

click me!