బ్యాంక్ వడ్డీ రేట్లలో మార్పు; SBI, PNB, HDFC, ICICI బ్యాంకుల్లో ఎంతంటే ?

By Ashok kumar Sandra  |  First Published Apr 19, 2024, 8:23 PM IST

ఫిక్స్‌డ్ డిపాజిట్ పై వడ్డీ రేటు బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. వివిధ బ్యాంకులు FDపై 3% నుండి 7.50% వడ్డీ రేటును అందిస్తాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.5% వడ్డీ రేటు లభిస్తుంది. 


 బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇన్వెస్టర్లకు ఇష్టమైన ఆప్షన్‌లలో ఒకటి. ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)ని టర్మ్ డిపాజిట్ లేదా టర్మ్ డెఫిసిట్ అని కూడా అంటారు. ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుందని చాలా మంది ఎఫ్‌డీని ఎంచుకుంటారు. ఈ డిపాజిట్ కొంత కాలానికి  లేదా మెచ్యూరిటీ వరకు ఫిక్స్డ్  ఆదాయాన్ని అందిస్తుంది. FDపై వడ్డీ రేటు బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది.

వివిధ బ్యాంకులు FDపై 3% నుండి 7.50% వడ్డీ రేటును అందిస్తాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.5% వడ్డీ రేటు లభిస్తుంది. కాబట్టి, ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టే ముందు, ఏ ఏ బ్యాంకు ఎంత వడ్డీ అందిస్తుందని వడ్డీ రేటును చెక్ చేయడం అవసరం. బ్యాంకుల్లో FD రేట్లు తరచుగా మారుతూ ఉంటాయి. అయితే ఏ బ్యాంకుల్లో ఎఫ్‌డీపై వడ్డీ రేటు ఎంత ఉందొ చూద్దాం ?

Latest Videos

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ బ్యాంక్   ఫిక్సెడ్ డిపాజిట్ (FD)లో పెట్టుబడి పెట్టే కస్టమర్లకు 3% నుండి 7% వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ ఇవ్వబడుతుంది. ప్రత్యేకించి ఒక సంవత్సరంలోపు మెచ్యూర్ అయ్యే FDలకు, బ్యాంకులు 6.8% వడ్డీ రేటును అందిస్తాయి. వీరు రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధితో FDపై 7% వడ్డీ రేటును కూడా అందిస్తారు. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్:  ఈ బ్యాంక్ FDలో 3.50% నుండి   7.50% వడ్డీ రేటు అందిస్తాయి. ముఖ్యంగా ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 6.75% వడ్డీ రేటు ఇవ్వబడుతుంది. ఒక సంవత్సరంలోపు మెచ్యూర్ అయ్యే FDలకు 6.75% వడ్డీ రేటు ఇవ్వబడుతుంది. ఒక సంవత్సరం FD కోసం సీనియర్ సిటిజన్లకు 7.25% వడ్డీ అందించబడుతుంది. 

ICICI బ్యాంక్: ICICI బ్యాంక్   FD పథకాలపై 3% నుండి 7.50% వడ్డీ రేటు అందించబడుతుంది. సీనియర్ సిటిజన్లకు శాతం 0.5% అదనపు వడ్డీ రేటు ఇవ్వబడుతుంది. ఒక సంవత్సరంలోపు మెచ్యూర్ అయ్యే FDకి 6.7% వడ్డీ రేటు ఇవ్వబడుతుంది. 

HDFC బ్యాంక్: HDFC బ్యాంక్ ఒక సంవత్సరం FD పై మంచి వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణ పెట్టుబడిదారులు ఒక సంవత్సరం FDపై 6.60 శాతం వడ్డీ రేటును పొందగా, సీనియర్ సిటిజన్లు 7.10 శాతం అదనపు వడ్డీ రేటును పొందుతారు. 

గత ఆరు నెలలుగా రెపో రేటులో ఎలాంటి మార్పు లేకుండా ఆర్‌బీఐ ఎప్పటిలాగే కొనసాగిస్తోంది. అందువల్ల, కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో గొప్పగా  మార్పులు చేయలేదు. రెపో రేటు పెరిగితే, బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. అదే రెపో రేటు తగ్గితే బ్యాంక్ ఎఫ్‌డిపై వడ్డీ రేటు తగ్గుతుంది. ఇలా లోన్ తీసుకునే వారికీ రెపో రేటు పెరిగితే, ఈఎంఐ పెరగడం వల్ల పాకెట్ పై  భారం పెరుగుతుంది. అదే FD పెట్టుబడిదారులకు రెపో రేటు పెరిగితే వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. దీంతో వారి డబ్బు కూడా  పెరుగుతుంది. 
 

click me!