అబ్బా..అంబానీ వాడే అల్ట్రా లగ్జరీ బాంబు ప్రూఫ్ కారు ధర ఇదేనా?

By Ashok kumar Sandra  |  First Published Apr 19, 2024, 5:33 PM IST

నీతా అంబానీ, కుమారులు ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ అండ్  శ్లోకా మెహతాలతో సహా ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 15000 కోట్లకు పైగా విలువైన భారతదేశంలోని అత్యంత ఖరీదైన ఇల్లు యాంటిలియాలో ఉంటున్నారు. 
 


 కోట్ల సంపదతో  భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ  లైఫ్ స్టయిల్ చాలా విలాసవంతమైనది. అలాగే అంబానీ ఫ్యామిలీ కొన్ని విషయాల వల్ల నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. రిలయన్స్ కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీ.  అయితే  అంబానీ ఫ్యామిలీ ట్రావెల్ చేసే కార్ ధర ఎంతో తెలుసా?

నీతా అంబానీ, కుమారులు ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ అండ్  శ్లోకా మెహతాలతో సహా ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 15000 కోట్లకు పైగా విలువైన భారతదేశంలోని అత్యంత ఖరీదైన ఇల్లు యాంటిలియాలో ఉంటున్నారు. 

Latest Videos

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్లలో ముఖేష్ అంబానీ ఒకరు. అతని దగ్గర  కోట్ల విలువైన కార్లు, వస్తువులు ఉన్నాయి. అందువల్ల, అంబానీ  ఇంటి వద్ద ఇంకా అతను ప్రయాణించేటప్పుడు హై సెక్యూరిటీ  ఉంటుంది.

ముకేశ్ అంబానీ భద్రత కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. అంబానీ కుటుంబ సభ్యులు యాంటిలియా నుండి బయటికి బయలుదేరినప్పుడు, భారీ SUVలు, సెక్యూరిటీ కార్ల భారీ కాన్వాయ్ అంబానీ కుటుంబాన్ని ఫాలో అవుతుంది. ముఖేష్ అంబానీ  తన కాన్వాయ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంటారు. 

ముఖేష్ అంబానీ   లగ్జరీ కాన్వాయ్‌లో రోల్స్ రాయిస్ కల్లినన్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-AMG G63, టయోటా ఫార్చ్యూనర్, MG గ్లోస్టర్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఈ కాన్వాయ్ కోసం 30 కోట్లు ఖర్చుపెట్టారు.

ముఖేష్ అంబానీ కాన్వాయ్‌లో కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్680 గార్డ్ లగ్జరీ సెడాన్ ఉంది. ఈ కార్ సాధారణ సెడాన్ కంటే దాదాపు 2 టన్నుల బరువు ఉంటుంది. అత్యంత  ఖరీదైన ఈ కారు గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 

ఈ కారు 6.0-లీటర్ V12 ఇంజన్‌తో 612 Ps, 830 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు బాడీకి ప్రత్యేక కాంపోజిట్ షెల్ ఉంది ఇంకా  కారులో బుల్లెట్ అండ్  బ్లాస్ట్ ప్రూఫ్, మల్టి లేయర్డ్ గ్లాస్ ఉన్నాయి.

ఈ కార్  గత సంవత్సరంలో ముఖేష్ అంబానీ కొన్న   రెండవ Mercedes-Benz S680 గార్డ్ లగ్జరీ సెడాన్. 10 కోట్ల రూపాయల ధరతో, ఈ సెడాన్ మహీంద్రా స్కార్పియో, రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ జి-వ్యాగన్, పెద్ద కాన్వాయ్ వంటి వాటితో పాటుగా కనిపిస్తుంది.

click me!