ఇంతకీ నెస్లే సెరెలాక్‌ మంచిదేనా..? పరిశోధనలో సంచలన విషయాలు!

By Ashok kumar SandraFirst Published Apr 18, 2024, 4:51 PM IST
Highlights

Cerelac: తాజాగా ప్రముఖ బేబి బ్రాండ్‌ నెస్లేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రొడక్ట్స్‌పై జరిపిన అధ్యయనంలో చాలా షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Nestle 's Cerelac: తాజాగా ప్రముఖ బేబి బ్రాండ్‌ నెస్లేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రొడక్ట్స్‌పై జరిపిన అధ్యయనంలో చాలా షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.నెస్లేకి చెందిన సెరెలాక్ లో మోతాదు మించి చక్కెర ఉన్నట్లు స్విట్జర్లాండ్‌లోని పబ్లిక్ ఐ అనే స్వతంత్ర పరిశోధన సంస్థ నివేదిక వెల్లడించింది.

అమెరికా, యూరప్, స్విట్జర్లాండ్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన మార్కెట్‌లలో నెస్లే ఈ ఉత్పత్తులను చక్కెర లేకుండా విక్రయిస్తుండగా.. ఆసియా, ఆఫ్రికా ఇంకా  లాటిన్ అమెరికా వంటి తక్కువ, మధ్యగా.. ఆదాయ అభివృద్ధి చెందుతున్న దేశాలలో విక్రయించే ఈ ఉత్పత్తులలో అధిక మొత్తంలో చక్కెర అధిక చక్కెర కలుపుతున్నట్లు పరిశోధనలో తేలింది.

ఒక్కో స్పూన్‌లో దాదాపు మూడు గ్రాములు చక్కెర ఉన్నట్లు పరిశోధన వెల్లడించింది. ఇది అంతర్జాతీయ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు పబ్లిక్‌ ఐ పేర్కొంది. ఇలా అధిక మోతుదులో కలపడం వల్ల ఊబకాయం, దీర్థకాలిక వ్యాధులు తలెత్తుతాయిని పరిశోధన వెల్లడించింది.  

పిల్లల ఆహారంలో చక్కెరలు కలుపకూడదనే WHO మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఈ రీసర్చ్ తెలిపింది. పబ్లిక్ ఐ అండ్  ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ (IBFAN) చేసిన కొత్త పరిశోధనలో పలు కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి.

ఈ తృణధాన్యాల ఉత్పత్తులలో మొత్తం 3 గ్రాముల చక్కెర ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని శాస్త్రవేత్త నిగెల్ రోలిన్స్ అన్నారు. తక్కువ ఆదాయ దేశాల్లో నెస్లే ఈ ఉత్పత్తులకు చక్కెరను కలపడం  సమర్థించలేని తప్పు అని, చాలా చిన్న వయస్సులో పిల్లలు కొంత మొత్తంలో చక్కెరకు అలవాటు పడేలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని రోలిన్స్ చెప్పారు.

ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో కంపెనీ విక్రయించే 150 ఉత్పత్తులను పరిశీలించిన తర్వాత.. ఆరు నెలల శిశువుల కోసం రూపొందించిన అన్ని సెరిలాక్ ఉత్పత్తులలో సగటున 4 గ్రాముల చక్కెర ఉన్నట్లు పబ్లిక్ ఐ వెల్లడించింది.

యూరోమానిటర్ ఇంటర్నేషనల్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నెస్లే 2022 నాటికి $1 బిలియన్‌కు పైగా అమ్మకాలతో బేబీ   బ్రాండ్‌గా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన ఉత్పత్తులలో చక్కెర వాడకాన్ని నిలిపివేయాలని పబ్లిక్ ఐ నెస్లేను హెచ్చరించింది. 

click me!