Chandrayaan-3 : చంద్రుడి ఉపరితలంపై పుష్కలంగా హీలియం-3 ఇంధనం..ఇది భారత్‌ చేతికి చిక్కితే..అమెరికా, చైనా వెనక్కే

By Krishna Adithya  |  First Published Aug 23, 2023, 3:36 PM IST

చంద్రయాన్ - 3 మిషన్ ద్వారా భారత్ మరో సూపర్ పవర్ కాబోతోందా .. అవుననే డిఆర్డిఓకు చెందిన శాస్త్రవేత్త అంటున్నారు. చంద్రుని మీద ఉన్నటువంటి హీలియం 3 భారత్ చేతికి చిక్కినట్లయితే. ఇక అమెరికా చైనా దేశాల సైతం వెనక్కు నెట్టవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.


చంద్రయాన్ 3 మిషన్ ద్వారా భారతదేశం సరికొత్త సువర్ణ అధ్యాయం లిఖించబోతోంది. చంద్రుడు పై అడుగుపెట్టిన అనంతరం ఇస్రోబ్యోమనవక అందించే వివరాలు ఎంతో విలువైనవని నిపుణులు పేర్కొంటున్నారు.  అంతేకాదు ముఖ్యంగా భవిష్యత్తు ఇంధన అవసరాలకు ఉపయోగపడే హీలియం 3 వంటి  వనరులు చంద్రుడు పై పుష్కలంగా ఉండే అవకాశం ఉందని తద్వారా.  మన దేశం ఇంధన రంగంలో అగ్రగామిగా ఎదిగే అవకాశం సైతం ఉందని  డి ఆర్ డి ఓ కు చెందిన మాజీ చీఫ్ కంట్రోలర్ ఆర్అండ్ డీ, ఏఎస్ పిళ్లై . అభిప్రాయపడ్డారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలకమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. 

చంద్రయాన్ విజయం భారతదేశ రోదసి చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించే అవకాశం ఉందని పేర్కొన్నారు అలాగే చంద్రయాన్ 3 మిషన్ ద్వారా భారతదేశం అమెరికా రష్యా చైనా సరసన చేరుతుందని పేర్కొన్నారు ఇప్పటివరకు కేవలం మూడు దేశాలు మాత్రమే చంద్రుడు పై తమ ప్రయోగాలను విజయవంతంగా సఫలీకృతం చేసుకున్నాయి.  అయితే ఈ సందర్భంగా పిల్లై కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు అందులో ప్రధానమైనది భవిష్యత్తు ఇంధన అవసరాలకు ఉపయోగపడే హీలియం 3 గురించి ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. 

Latest Videos

హీలియం 3 అనేది  నాన్ రేడియో యాక్టివ్ ఐసోటోప్,  ఇది ఒక జడ వాయువు ఇందులో ఒక న్యూట్రాన్ రెండు ప్రోటాన్లు ఒక న్యూక్లియస్ ఉంటాయి.  భూమ్మీద ఇలాంటి మూలకం కనుగొనడం చాలా కష్టం.  కానీ కొద్ది మొత్తంలో సహజవాయువులో హీలియం 3  ట్రేసెస్ రూపంలో దొరుకుతుంది కానీ పెద్ద మొత్తంలో లభించదు. 

అదే చంద్రుడిపై అయితే హీలియం 3  పెద్ద మొత్తంలో లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొంటున్నారు.  అణు ఇంధనాన్ని నియంత్రించే  ఈ ఐసోటోప్ వల్ల  భవిష్యత్తులో అను విద్యుత్ ఉత్పత్తికి చాలా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొంటున్నారు.  చంద్రుడి ఉపరితలంపై హీలియం 3   పుష్కలంగా లభించే అవకాశం ఉందని ఇందుకు కారణం చెబుతూ చంద్రుడి ఉపరితలంపై  వాతావరణం లేకపోవడంతో సూర్యకాంతి నేరుగా చంద్రుని తాకుతుందని అందుకే అక్కడ హీలియం 3  విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొంటున్నారు.  చంద్రయాన్ మిషన్లో ఇది ఒక ప్రధాన భాగం అని ఆయన పేర్కొన్నారు.  ఒకవేళ హీలియం - 3  మూలకం పెద్ద మొత్తంలో లభిస్తే అది భారత్  ఇంధన అవసరాలను తీర్చడంలో చాలా ఉపయోగపడుతుందని పిల్లని పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే చంద్రయాన్ 3  ప్రయోగం సఫలం కావాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు.  అటు శాస్త్రవేత్తలకు మద్దతుగా  ప్రజలు తమ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులు,  విశ్వవిద్యాలయాలకు చెందిన  ప్రొఫెసర్లు చంద్రయాన్ 3  విజయం కోసం  ఆకాంక్షిస్తున్నారు.

click me!