Chandrayaan-3 వల్ల మన దేశానికి ఆర్థికంగా జరిగే లాభం ఇదే...భవిష్యత్తులో భారీగా ఆదాయం ఎలాగంటే..?

By Krishna Adithya  |  First Published Aug 23, 2023, 1:05 PM IST

భారతదేశ కీర్తి పతాక చంద్రయాన్ ద్వారా యావత్ ప్రపంచానికి తెలియనుంది.  చంద్రుడు మీద చంద్రయాన్ 3  మిషన్ విజయవంతం అయిన తర్వాత,   ఇస్రో ఖ్యాతి యావత్ ప్రపంచం  దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.  అయితే చంద్రుడు మీద జరుగుతున్నటువంటి పరిశోధనలు ఎందుకు అసలు చంద్రుడు మీద ఏముంది దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కదా..  అనుకునే  వర్గాలు చాలా ఉన్నాయి. అలాంటి సందేహాలను నివృత్తి చేస్తూ ఇస్రో ప్రయోగాల వల్ల దేశం ఆర్థికంగా ఎంత ప్రయోజనం పొందుతుందో తెలుసుకుందాం. 


  కానీ ఒక దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించినప్పుడే ఆ దేశం అగ్రదేశంగా మారుతుంది.  ఈ విషయాన్ని భారతదేశం స్వాతంత్రం పొందిన సమయంలోనే అప్పటి శాస్త్రవేత్తలు గుర్తించి.  దేశానికి స్వాతంత్రం వచ్చి తొలి అడుగులు వేస్తున్న క్రమంలోనే,  దేశం అనేక రంగాల్లో ఇంకా స్వయం సమృద్ధి సాధించినప్పటికీ,  పాశ్చాత్య దేశాలు వెక్కిరిస్తున్నప్పటికీ మన దేశం 1950వ దశకంలోనే   స్పేస్ రీసర్చ్ ప్రోగ్రాం పైన దృష్టి సారించింది.  నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ,  ప్రముఖ శాస్త్రవేత్త అణుశాస్త్ర పితామహుడు  హోమి జహంగీర్ బాబా మార్గదర్శకత్వంలో  Indian National Committee for Space Research - INCOSPAR స్థాపించి  యువ ఇంజనీర్లతో స్పేస్ రీసర్చ్ ప్రోగ్రాం ప్రారంభించారు.

ఇస్రో తొలి అడుగులు..

Latest Videos

 అమెరికా రష్యా స్పేస్ రీసర్చ్ ప్రోగ్రాం లో అప్పటికే ప్రపంచంలోనే అగ్రగామి దేశాలుగా ఉన్నాయి.  మానవ సహిత రోదసి కార్యక్రమాన్ని సైతం అవి ప్రారంభించాయి.  అలాంటి సమయంలో కడుపు పేదరికంలో ఉన్నటువంటి భారతదేశం స్పేస్ రీసర్చ్ ప్రోగ్రాం చేయడం ఏంటా అని  పాశ్చాత్య మీడియా వెక్కిరించిన పరిస్థితి.  మౌలిక సదుపాయాలు లేకపోయినప్పటికీ మన ఇంజనీర్లు శాస్త్రవేత్తలు అకుంఠిత దీక్షతో ఉపగ్రహం తయారు చేయాలని పట్టుబట్టి దశాబ్దాల తరబడి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.  ముఖ్యంగా  విక్రమ్ సారాభాయ్,  సతీష్ ధావన్,  వంటి శాస్త్రవేత్తలు కృషి కారణంగా నేటి ఇస్రో పురుడు పోసుకుంది. Indian National Committee for Space Research - INCOSPAR  ప్రస్తుతం ఇస్రోగా అవతరించి,  అగ్ర రాజ్యాలు సైతం ఆశ్చర్యపోయేలా నేడు ఇస్రో తన సత్తా చాటుతోంది. 

ఇస్రో అంతరిక్ష పరిశోధనలతో దేశానికి ఆర్థికంగా లాభం ఉందా..

మరి ఇస్రో వల్ల దేశానికి వచ్చే లాభం ఏంటి ఆదాయం లభిస్తుందా రెవెన్యూ వస్తుందా అనే సందేహాలు ప్రతి ఒక్కరికి కలగడం సహజమే.  నిజానికి ఇస్రో  అమలు చేస్తున్న కార్యక్రమాల ద్వారా రెవెన్యూ పరంగా మన దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ISRO చేత స్థాపించబడిన కమర్షియల్ విభాగం, ISRO మార్కెటింగ్ విభాగంగా యాంట్రిక్స్ ను సెప్టెంబర్ 1992లో భారత ప్రభుత్వానికి చెందిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా స్థాపించబడింది.  ఈ సంస్థ కమ్యూనికేషన్స్ రంగంలో పలు సేవలను అందిస్తోంది. 

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)కు చెందిన యాంట్రిక్స్ వాణిజ్య మరియు మార్కెటింగ్ విభాగంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని అంతర్జాతీయ వినియోగదారులకు అంతరిక్ష ఉత్పత్తులు, సాటిలైట్స్, ఇతర సర్విలెన్స్  సేవలను అందిస్తుంది. 2008లో రూ. 950 కోట్ల టర్నోవర్‌ సాధించగా, యాంట్రిక్స్‌కు భారత ప్రభుత్వం 2007-08కి "మినీ రత్న కంపెనీ" హోదాను అందించింది. 2012-13లో కంపెనీ ఆదాయం రూ.1300 కోట్లు కాగా 2013-14లో దాదాపు రూ.1600 కోట్లకు పెరిగింది. 

యాంట్రిక్స్‌కు EADS, Austrim, , Intelsat, Avanti Group, WorldSpace, Inmarsat, WorldSat Guru, DLR, Kari, Eutelsat, OHB సిస్టమ్స్, యూరప్, మిడిలిస్ట్ లోని అనేక ప్రముఖ అంతరిక్ష సంస్థలు,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కార్పోరేట్ సంస్థలు ప్రతిష్టాత్మక కస్టమర్‌లుగా ఉన్నారు.  యాంట్రిక్స్ 2016 - 2019 మధ్య 239 ఉపగ్రహాలను ప్రయోగించింది, మొత్తం ఆదాయం రూ. 6,289 కోట్లు సాధించింది. 

చంద్రయాన్ వల్ల భవిష్యత్తులో భారీగా రెవెన్యూ లభించే అవకాశం..

ఇస్రో ప్రస్తుతం దాదాపు 50 దేశాలకు పైగా అనేక సంస్థలు ప్రభుత్వాలతో ఒప్పందాలు కలిగి ఉంది.  కమ్యూనికేషన్ విభాగంలో ఇస్రో ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన,  అలాగే తక్కువ ఖర్చుతో టెక్నాలజీని ఉపయోగిస్తుందనే పేరు సంపాదించుకుంది.  ప్రస్తుతం చంద్రయాన్ ద్వారా ఇస్రోఖ్యాతి మరింత పెరిగే అవకాశం ఉంది తద్వారా ఇతర దేశాలు సైతం చంద్రుని పరిశోధనలో భాగస్వామ్యం అవడం ద్వారా మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.  భవిష్యత్తులో చంద్రుడిపైన ఇస్రో ఇతర గ్రహాలపై వెళ్లేందుకు లాంచింగ్ స్టేషన్ కనుక ప్రారంభించినట్లయితే.  ఇస్రో ఆధీనంలోని ఆ లాంచింగ్ స్టేషన్  ఉపయోగించుకునేందుకు పలు దేశాలు మనతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది తద్వారా రెవెన్యూ మరింత పెరుగుతుంది. 

 

click me!