బ్రైట్‌కామ్‌ గ్రూప్‌పై సెబీ కొరడా...ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపులో గోల్ మాల్..

By Krishna Adithya  |  First Published Aug 23, 2023, 3:10 PM IST

బ్రైట్‌కామ్ గ్రూప్ కేసులో  సెబీ మరో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. డిజిటల్ అడ్వర్టైజింగ్ రంగంలోని బ్రైట్‌కామ్ గ్రూప్ కేసులో. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రమోటర్లు మార్కెట్‌లో పనిచేయకుండా మార్కెట్ నియంత్రణ సంస్థ నిషేధించింది. అలాగే, ప్రమోటర్లు కూడా లిస్టెడ్ కంపెనీలలో పదవులను నిర్వహించకుండా నిషేధించారు.


ఆగస్ట్ 22న బ్రైట్‌కామ్ షేర్ల విక్రయాన్ని నిషేధిస్తూ రెగ్యులేటర్ సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డర్ తర్వాత ఇన్వెస్టర్ శంకర్ శర్మతో సహా 23 మంది బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లను విక్రయించలేరు. బ్రైట్‌కామ్ గ్రూప్ ప్రిఫరెన్షియల్ షేర్‌లను పరిశీలించిన తర్వాత సెబీ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  దర్యాప్తులో భాగంగా బ్రైట్‌కామ్ గ్రూప్ ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు సెబీ గుర్తించింది. దీనితో పాటు, బ్రైట్‌కామ్ గ్రూప్ డబ్బును మళ్లించడానికి కేటాయించిన వారి నుండి షేర్ దరఖాస్తు డబ్బుకు నకిలీ రసీదులు తీసుకున్నట్లు కూడా తేలింది.

ఎండీ, చైర్మన్‌లు ఏ పదవి చేపట్టకుండా నిషేధం 

Latest Videos

బ్రైట్‌కామ్ ఎండి, ఛైర్మన్ సురేష్ కుమార్ రెడ్డి, దాని సిఎఫ్‌ఓ నారాయణ రాజు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లిస్టెడ్ కంపెనీ లేదా దాని అనుబంధ సంస్థలో డైరెక్టర్ లేదా మేనేజర్ స్థాయి పదవిని నిర్వహించకుండా మార్కెట్స్ రెగ్యులేటర్ సెబి నిషేధించింది. దీంతో పాటు కంపెనీ షేర్లను విక్రయించకుండా సురేష్ కుమార్ రెడ్డిపై నిషేధం విధించింది. SEBI, దాని మధ్యంతర ఉత్తర్వులో, ఆడిటర్ కంపెనీ P. మురళి & కో.  PCN & అసోసియేట్‌లతో సహా వారి కొత్త లేదా మాజీ భాగస్వాములు బ్రైట్‌కామ్ లేదా దాని అనుబంధ సంస్థలు సైతం కంపెనీకి ఎలాంటి సేవలు అందించకూడదు. 

అసలు ఏం జరిగింది. 

బ్రైట్‌కామ్ గ్రూప్  ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ప్రకారం కోట్లాది రూపాయలను సమీకరించింది. ఆ మొత్తం  కంపెనీకి అందలేదు. 22 మందికి 25.76 కోట్ల షేర్లు కేటాయించారు. కేటాయింపు రేటు ప్రకారం రూ.245.24 కోట్లు రావాల్సి ఉంది. కానీ కంపెనీ ఆదాయం రూ.52.51 కోట్లు మాత్రమే ఉంది. కానీ  రూ.192.73 కోట్లు కంపెనీకి రాలేదు.  

 కంపెనీల అవకతవకలు జరిగినట్లు సెబీ గుర్తించింది.  షేర్ల రూపంలో  కంపెనీకి రావాల్సిన డబ్బు, మరొక మార్గంలో తిరిగి వెళ్ళింది. పెట్టుబడిదారుల నుంచి ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని మార్కెట్‌ రెగ్యులేటర్‌కు ఫిర్యాదులు అందాయి. అంతేకాదు  సెబీకి ప్రస్తుతం బ్రైట్ కామ్ గ్రూపు తప్పుదోవ పట్టించేలా బ్యాంకు స్టేట్మెంట్లను సైతం తప్పుడు మార్గంలో సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన నివేదికలు కూడా తప్పుడు మార్గంలోనే అవకతవకల్లో అందించినట్లు షఫీ అనుమానిస్తోంది కంపెనీ యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది.  జూలైలో సెబీని తప్పుదారి పట్టించడానికి కంపెనీ ఫోర్జరీ  బ్యాంకు డాక్యుమెంట్లను  సమర్పించినట్లు సెబీ తెలిపింది.

 


 

click me!