జీతం పొందే ఉద్యోగులకు చేదు వార్త... ఇపిఎఫ్ వడ్డీరేటు తగ్గిస్తూ నిర్ణయం..

By Sandra Ashok Kumar  |  First Published Mar 5, 2020, 2:12 PM IST

2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.50 శాతానికి (15 బేసిస్‌ పాయింట్లు)  తగ్గిస్తూ నిర్ణయించింది.


న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) డిపాజిట్లపై వడ్డీని తగ్గించే అవకాశం ఉన్నందున జీతం పొందే ఉద్యోగులకు చేదు వార్త.ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీ రేట్లపై కోత పెట్టింది. 

2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.50 శాతానికి (15 బేసిస్‌ పాయింట్లు)  తగ్గిస్తూ నిర్ణయించింది.

Latest Videos

undefined

also read ఆన్‌లైన్‌లో టాటా నుండి స్పెషల్ లగ్జరీ కాఫీ...

ఈ రోజు జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) సమావేశంలో 2019-20 సంవత్సరానికి ఇపిఎఫ్ వడ్డీరేటును 8.5 శాతంగా ఉంచినట్టు ఇపిఎఫ్ఓ నిర్ణయించింది "అని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి గంగ్వర్ సమావేశం తరువాత విలేకరులతో అన్నారు.

అంతకుముందు 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్) డిపాజిట్లపై  8.65% వడ్డీ రేటు ఉండేది. ఇప్పుడు అంతా కంటే తక్కువకు 8.5% వడ్డీ రేటు నిర్ణయించారు.

also read మార్చి 27న మళ్ళీ బ్యాంకు యూనియన్ల సమ్మె...

  పీఎఫ్‌ వడ్డీరేటు కుదింపుపై నేడు 2019-20 సంవత్సరానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వడ్డీ రేటుతో సహా పలు అంశాలపై కేంద్రంలో ఉద్యోగులు, ప్రభుత్వాల ప్రతినిధులతో కూడిన ఈ‌పి‌ఎఫ్‌ఓ ​​సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు గురువారం సమావేశం తరువాత  తుది నిర్ణయం తీసుకుంది.

 కేంద్రం  నిర్ణయంపై పీఎఫ్‌ వడ్డీరేటు కుదింపు  ఈపీఎఫ్‌వోలోని  60 మిలియన్ల ఖాతాదారులను ప్రభావితం చేయనుంది. అయితే సమావేశం తరువాత కార్మిక మంత్రి కొత్త ఇపిఎఫ్ వడ్డీ రేటును 8.65% నుండి 8.50% వద్ద కుదించినట్లు పేర్కొన్నారు.
 

click me!