పోలీసులకు బురిడీ...పాస్‌‌‌‌పోర్ట్ లేకుండా జపాన్ నుంచి పారిపోయిన నిస్సాన్-రెనాల్ట్ మాజీ ఎండీ

By Sandra Ashok Kumar  |  First Published Jan 2, 2020, 12:36 PM IST

నిస్సాన్-రెనాల్ట్ మాజీ అధిపతి కార్లోస్ జపాన్‌‌ పోలీసుల కన్నుగప్పి పారిపోయారు. లెబనాన్‌కు వెళ్లి ఈ-మెయిల్ చేసే వరకు ఈ సంగతి బహిర్గతం కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 


టోక్యో: చుట్టూ ఎన్నో ఆంక్షలు… అడుగడుగునా నిఘా.. అడుగు తీసి అడుగు వేస్తే అధికారులకు తెలిసిపోతుంది.. వీడియో కనుసన్నల్లో ఉన్నా.. అయినా భలే తప్పించుకు పారిపోయారు నిస్సాన్ మోటార్ కంపెనీ, రెనాల్ట్ మాజీ హెడ్‌‌‌‌ కార్లోస్ ఘోస్న్‌‌‌‌. కఠిన నిబంధనల నుంచి తప్పించుకుని, పాస్‌‌‌‌పోర్ట్ లేకుండానే జపాన్ నుంచి లెబనాన్‌కు పారిపోవడం గమ్మత్తుగా ఉంది. 

కార్లోస్ ఘోష్న్ పారిపోవడంపై ఒక్కొక్క మీడియా సంస్థ, ఒక్కో వార్త కథనాన్ని వెల్లడిస్తోంది. క్రిస్టమస్ సెలబ్రేషన్స్‌‌‌‌ కోసం తన ఇంటికి వచ్చిన మ్యూజిక్ ఇన్‌‌‌‌స్ట్రుమెంట్ బ్యాండ్‌‌‌‌లో టోక్యోకు పారిపోయారని, ఆ తర్వాత ప్రైవేట్ ప్లేన్ ఎక్కేసి టోక్యో నుంచి లెబనాన్‌‌‌‌ చెక్కేశారని మీడియా కథనాలు వస్తూనే ఉన్నాయి. 

Latest Videos

undefined

also read  విజయ్ మాల్యా ఆస్తుల వేలానికి... కోర్టు గ్రీన్ సిగ్నల్

అసలు కార్లోస్ దేశం విడిచిపోయిన సంగతి, ఆయన ఈ-మెయిల్ విడుదల చేసేంత వరకు ఎవరికీ తెలియదు. ఇదంతా ఒక హాలీవుడ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ను తలపిస్తున్నట్టు మీడియా పేర్కొంటున్నది. కార్లోస్‌‌‌‌ తన వ్యక్తిగత లబ్ది కోసం కార్పొరేట్ వనరులను వాడుకున్నారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలున్నాయి. వీటిని కార్లోస్ కొట్టిపారేస్తున్నారు కూడా. జపాన్ జ్యుడిషియల్ సిస్టమ్‌‌‌‌ అన్యాయానికి, రాజకీయ హింసకు పాల్పడుతోందని లెబనాన్‌‌‌‌ నుంచి కార్లోస్ ఆరోపించారు.

కార్లోస్ పారిపోవడం ఎలా సాధ్యమైందంటూ.. ప్రశ్నలే తప్ప సమాధానాలు దొరకడం లేదు. ఒకవైపు పాస్‌‌‌‌ పోర్ట్‌‌‌‌లన్నీ కూడా జపాన్ ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. ఆయన పారిపోవడానికి ఆయన భార్య కరోల్‌‌‌‌ మేజర్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌ వహించారని వాల్‌‌‌‌స్ట్రీట్ జర్నల్ చెప్పింది. ఓ ఫ్రెంచ్ డైలీ వార్త కథనం ప్రకారం, కార్లోస్ ఘోస్న్‌‌‌‌ పారిపోవడం వెనుక ఆయన సోదరులు, టోక్యోలో వారికి ఉన్న కాంటాక్ట్‌‌‌‌లు సాయం చేశాయని తెలుస్తోంది. 

తన భర్త కార్లోస్ ఘోష్ ఐడీ కార్డుతోనే లెబనాన్‌‌‌‌లోకి ఎంటర్‌‌‌‌‌‌‌‌ అయినట్టు ఆయన భార్య కరోల్ చెబుతున్నారు. అయితే లెబనాన్‌‌‌‌కు చెందిన న్యూస్‌‌‌‌పేపర్ మాత్రం, వాటన్నింటికీ భిన్నంగా ఫ్రెంచ్ పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌తో కార్లోస్ తమ దేశంలోకి ఎంటర్‌‌‌‌‌‌‌‌ అయినట్టు పేర్కొంది. కానీ ఆయన పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌లన్నీ జపనీస్‌‌‌‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

also read ‘మహారాజా’పై ఎతిహాద్ ‘కన్ను’.. టాటా సన్స్, ఇండిగో కూడా..

కార్లోస్‌‌‌‌కు లెబనీస్, ఫ్రెంచ్, బ్రెజిలియన్ పౌరసత్వం ఉంది. ఫోర్జ్‌‌‌‌డ్ పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌తో తప్పుడు ఐడెంటీ కార్డుతో కార్లోస్ జపాన్ విడిచి పారిపోయినట్టు ఫ్రెంచ్‌‌‌‌ న్యూస్‌‌‌‌పేపర్ లీస్ ఎకోస్ చెప్పింది. ఆ తర్వాత ఒక చిన్న ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ నుంచి ప్రైవేట్ ప్లేన్‌‌‌‌లో లెబనాన్ చెక్కేశారని పేర్కొంది. అయితే కార్లోస్‌‌‌‌ చట్టబద్ధంగానే లెబనాన్ వచ్చారని ఆ దేశ విదేశీ మంత్రిత్వ శాఖ చెప్పింది. జపాన్‌‌‌‌ నుంచి బీరుట్ ఎలా చేరుకున్నారన్నది మాత్రం తెలియదని తెలిపింది. 

కార్లోస్ ఘోస్న్‌‌‌‌ పారిపోవడం ట్విటర్‌‌‌‌‌‌‌‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. లెబనాన్‌‌‌‌లోని తన కొత్త ఇంటి నుంచి కార్లోస్‌‌‌‌ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కార్లోస్‌‌‌‌ ఇన్ని ఆంక్షల నుంచి ఎలా జపాన్ విడిచి పారిపోయారన్న దానిపై జపాన్ లా ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్, కస్టమ్స్ అధికారులు కూడా వివరణ ఇవ్వాల్సి ఉంది.

click me!