బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినీ తన 71వ జన్మ దినోత్సవం సందర్భంగా MG Hector SUV కారును కొనుగోలు చేశారు. ఇది ప్రయాణానికి అనువుగా ఉంటుందన్నారు. వంగి కూర్చోనవసరం లేదన్నారు.
ముంబై: బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినీ ఇటీవలే 71వ వసంతంలో అడుగు పెట్టారు. ఇప్పటికీ చెక్కు చెదరని అందం.. అదే విశ్వాసం.. అందునా ఇప్పుడు బీజేపీ ఎంపీ.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇప్పటికే ఆమె ఇంట పలు రకాల కార్లు ఉండొచ్చు. అయితేనేం.. బర్త్ డే సందర్భంగా సెలబ్రిటీలు ఖరీదైన కార్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారు. అలాగే హేమ మాలినీ కూడా తన పుట్టిన రోజు సందర్భంగా సరికొత్త కారు కొనుగోలు చేశారు. అదీ ఎంజీ మోటార్స్ వారి ఎస్‌యూవీ కంపాక్ట్ హెక్టార్ కారు కొనుగోలు చేశారు. ఈనెల 16వ తేదీన తన బర్త్ డే నాడే షో రూమ్ నుంచి స్వయంగా ఆమె డెలివరీ తీసుకున్నారు.
రెవెన్యూ పెంపే లక్ష్యం.. ఐటీ పేమెంట్స్ లో రిలీఫ్?
దీనికి సంబంధించిన వీడియోను ఎంజీ హెక్టార్ మోటార్స్ ముంబై షోరూమ్ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్ సామర్థ్యం గల ఈ షార్ప్ వేరియంట్ కారును ఆమె కొనుగోలు చేశారు.
ఎంజీ హెక్టార్ కారు కొనుగోలు దారి తీసిన పరిస్థితులను ఆమె వివరించారు. ‘నేను ఒక ఎస్‌యూవీ కంపాక్ట్ కాను కొనాలని చూశా.. అదే అంశం చర్చకు వచ్చినప్పుడు నా వదిన ఎంజీ హెక్టార్ కారు బావుంటుందని సూచించారు. నేను కూడా విమానాశ్రయంలోఈ కారును చూశాను. నచ్చింది.. బావుంది. సమీపంలోని షోరూమ్ కు వెళ్లి పరిశీలించాను. దీనిలో వంగికూర్చోవాల్సిన అవసరం లేదు. కారు బాగుంది’ అని చెప్పారు.
ఎంజీ హెక్టార్ కారును కొనుగోలు చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నానని హేమమాలిని చెప్పారు. పనోరమిక్ సన్ రూఫ్, సన్ గ్లాస్ హోల్డర్, హీటెడ్ ఓఆర్వీఎం, రైన్ సెన్సింగ్ వైపర్స్, ఎయిట్ కలర్ ఆంబియెంట్ లైట్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
రూ.2000 చెల్లిస్తే సరి! 2 గంటలు సెల్ఫ్ డ్రైవ్.. ఓలా వినూత్న సర్వీస్
ఏడంగుళాల ఎంఐడీ, పవర్డ్ టెయిల్ గేట్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఫుష్ బటన్ స్టార్ట్- స్టాప్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెదర్ సీట్స్, పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, లెదర్ రాప్డ్ స్టీరింగ్ వీల్, క్రోమ్ ఫినిష్ ఆన్ ది రోడ్ ఆర్మ్ రెస్ట్, ఎల్ఈడీ రీడింగ్ ల్యాంప్ కూడా ఉన్నాయి.
6 ఎయిర్ బ్యాగ్స్ తో కూడిన అదనపు సేఫ్టీ ఫీచర్లు, 10.4 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే సిస్టం తదితర ఫీచర్లు జత చేశారు.